మోడీ ప్రభంజనం

“స్వాతంత్ర్య పోరాటంలో ఎంతోమంది ప్రాణ త్యాగం చేశారు. దేశం కోసం మరణించే అదృష్టం మనకు లభించలేదు. కానీ, దేశం కోసం జీవించే అవకాశం ప్రతి ఒక్కరికీ ఉంది”. ఆస్ట్రేలియా దేశంలో పర్యటిస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు ఇది. దాదాపు రెండు నెలల క్రితం అమెరికా లోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్ మోడీ నామ జపంతో ఊగిపోతే తాజాగా సిడ్నీ లోని అల్ఫోన్స్ ఎరీనాలోనూ అదే దృశ్యం కనిపించింది. ఎవరి నోట విన్నా మోడీ నామ జపమే.

“మీరు కదిలితే దేశం ముందుకు వెడుతుంది. దేవుడు మీకు ఎంతో ఇచ్చాడు. మాతృ భూమికి సహాయపడండి” అని ఆయన కోరారు. పేదలకు ఆరోగ్యమే పెద్ద వరమనీ, స్వచ్చ భారత్ కు సహకరించాలనీ ఆయన అక్కడి భారతీయులను ఈ సందర్భంగా కోరారు. భారత దేశానికి వచ్చే ఆస్ట్రేలియన్ ప్రవాసులకు వీసా ఆన్ అరైవల్ ఏర్పాటు చేస్తామని ఆయన  హామీ ఇచ్చారు.  ప్రవాసులను భారతీయ సంతతికి చెందినవారు, ప్రవాస భారతీయులు అనే రెండు రకాల వర్గీకరణను రెండు నెలల్లో ఏకం చేస్తామని ఆయన హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. “భారత మాతకు 250 కోట్ల చేతులున్నాయి.

ఇందులో 200 కోట్ల చేతులు 35 ఏళ్ల లోపు వారివే. భారత్ ఆకాంక్షలను నెరవేర్చే సత్తా వీరికి ఉంది” అని ఆయన అశేష జనవాహినిని ఉద్దేశించి అన్నారు.

Send a Comment

Your email address will not be published.