యాదాద్రి లక్ష్మినరసింహ క్షేత్రం

యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రం నల్గొండ జిల్లాలోని అంత్యంత పవిత్రమైన ప్రముఖ దివ్య క్షేత్రం ! ఈ క్షేత్రం మూలకథ వాల్మీకి రామాయణంలోయిలా వుంది.

విభాండక ఋషి కుమారుడు రుష్యశృంగుడు. అతని కుమారుడు హాదర్షి నరసింహ స్వామి భక్తుడు. అతనికి స్వామివారిని ప్రత్యక్షంగా చూడాలని కోరిక పుట్టింది. ఆంజనేయస్వామి సలహా మేరకు తపస్సు చేయగా స్వామి ప్రత్యక్షమయ్యాడు. ఆ ఉగ్ర నరసింహ మూర్తిని చూడలేక శాంత స్వరూపంతో కనిపించమని యాదర్షి కోరగా స్వామి వారు కరుణించి లక్ష్మి సమేతుడై దర్శన మిచ్చి “ఏంకావాలో కోరుకోమంటే యాదర్షి స్వామిని “శాంత మూర్తి రూపంలో కొలువై కొండపై వుండి పొమ్మని కోరాడు. ఆవిధంగా లక్ష్మి నరసింహ స్వామి కొండపై అలా కొలువై పోయాడు. కొన్నాళ్ళకు స్వామివారిని మళ్ళీ వేర్వేరు రూఫాల్లో చూడాలనిపించి యాదర్షి రెండవ సారి తపస్సుకుపక్రమించాడు. అతని కోరిక మేరకు స్వామి జ్వాలా, యోగా, నంద, గండబేరుండ, నారసింహ రూపాల్లో దర్శనమిచ్చాడు. అందుకే ఈ క్షేత్రాన్ని పంచ నారసింహ క్షేత్రం అంటారు. ఆ ఋషి కోరిక మేరకే ఆ కొండ యాదాద్రిగా పేరుమీద ప్రసిధ్ధికెక్కింది. అయితే ఆ ఋషి తపస్సు చేసిన స్థల కొండ క్రింద వున్న పాత లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గర అని చెప్తారు. యాదర్షికి స్వామి దర్శన భాగ్యం కూడా అక్కడే లభించిందని చెప్పబడ్డుతోంది. ఆ మహర్షి కోరిక మేరకే ఆంజనేయస్వామి యాదాద్రి క్షేత్రపాలకుడుగా వున్నాడని కూడా స్థలపురాణం వివరిస్తోంది .

ఇక యిక్కడి విశేషాల్లో చెప్పుకోదగ్గవి కొన్ని వున్నాయి. ఆలయగర్భగుడిలో స్వామివారి పాదాల వద్ద ఓ చిరు జల ప్రవాహకొండ పగులు కనిపిస్తుంది. ఆ పగులులోని జలాలతోనే స్వామివారికి అభిషేకం చేయటంజరుగుతోంది. అంతేగాక ఇప్పటికీ రోజూ రాత్రుళ్ళు ఆ చుట్టుప్రక్కల కొండలమీద తపస్సు చేసుకుంటున్న ఋషులు ఈ కొండకి చేరుకుని యిక్కడి విష్ణు పుష్కరిణిలో స్నానం చేసిన తర్వాత స్వామిని సేవిస్తారని స్థానికుల నమ్మకం . ఆ కారణాల ఆధారంగా వారి పాదాల గుర్తులు పుష్కరిణి ప్రాంతంలో కనిపిస్తాయి. భక్తులు ఆ పాదాల నిదర్శనాలకి గంధ పుష్పాదులని సమర్పిస్తూ వుంటారు. పైగా ఆ ఋషులు కొండకి చేరుకునే సమయంలో వాయుతరంగాలు మృదంగ ధ్వనులని వినిపిస్తాయని కూడా చెప్పుకోబడుతోంది.. మరో విశేషం ఏమిటంటే ఆ ఋషులు కొండ పైకి వచ్చే మెట్లదారిన పైకి చేరుకొని స్వామిని సేవించినవారికి కీళ్ళ నొప్పులు తగ్గుతాయని కూడా భక్తుల విశ్వసించటం జరుగుతోంది.. అంతేకాక చాలామంది భక్తులు ఆరోగ్యం, గ్రహపీడా నివారణ, వగైరా కోరికలతో మొక్కులు తీర్చుకుంటూ కొన్నాళ్ళపాటు యిక్కడే వుండి విష్ణు పుష్కరిణిలో స్నానం చేస్తూ స్వామిని సేవిస్తుంటారు .

మరొక కథనం ప్రకారం లక్ష్మీ నరసింహస్వామివారు మొదట పాత లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో వెలసింతర్వాతే ఓ అశ్వాన్ని అధిరోహించి కొత్త లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయాన్ని చేరుకున్నారట. అందుకే ఆ గుర్రపు అడుగుల గుర్తులు పాత లక్ష్మీనరసింహస్వామివారి ఆలయం నుంఛి కొత్తలక్ష్మీనరసింహస్వామివారి ఆలయము వరకు అక్కడక్కడా కనిపిస్తాయి. ఆ దారిలోనే ఓ శివాలయం మరో ఆంజనేయ స్వామి ఆలయాలు కూడా కనిపిస్తాయి.

ఆరకంగా ఈ పుణ్యక్షేత్రం రూపు దిద్దుకోవటంతో యిక్కడ భక్తుల రద్దీ రోజురోజుకూ ఎక్కువవుతోంది. పైగా యిక్కడికి దగ్గరగా వున్న రాయగిరి, వంగపల్లి రైల్వే స్టేషన్లనుంచి వచ్చి వెళ్ళే ప్రయాణీకుల రద్దీ కూడా పెరిగింది. దాంతో ప్రస్తుతం నడుస్తోన్న రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన బస్సులు జనం రాకపోకలకు ఎంత మాత్రమూ సరిపోని పరిస్థితి ఏర్పడింది. తద్వారా ప్రైవేట్ బస్సులే ఎక్కువగా నడుస్తున్నాయి. అయితే ఈ రెండు రకాల బస్సులు కేవలం హైదరాబాద్, హన్మకొండ మొదలగు జిల్లా కేంద్రాలకే నడుస్తున్నాయి. కాని శ్రీశైలం, బాసర, వేములవాడ, కాళేశ్వరం, భద్రాచలం, ధర్మపురి తదితర పుణ్యక్షేత్రాలకు సరాసరి సౌకర్యం ఈనాటికీ ఏర్పడలేదు. కాని యిన్నాళ్ళకు ఈ క్షేత్రాలతో బాటుగా యాదాద్రి నుంచి తిరుపతి పుణ్యక్షేత్రానికి కూడా బస్సులను నేరుగా నడపాలని ప్రస్తుత ప్రభుత్వాధికారులు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. అందుకు నేటి సామాన్య జనంతోబాటుగా ముందుతరాల భక్తులందరూ కూడా ఎంతో  సంతోషించాలి.

SP Chari

 

Send a Comment

Your email address will not be published.