రంజాన్ విందు

రంజాన్ పర్వ దినాన్ని పురస్కరించుకొని పెర్త్ తెలుగు సంఘం ముస్లిం సోదరులకు  ఏర్పాట్లు చేసారు.  ఈ కార్యక్రమానికి తెలుగు మాట్లాడే ముస్లిం సోదరులే కాకుండా ఎంతో మంది హిందూ మతాన్ని పాటించే తెలుగువారు రావడం ఈ పండుగను అందరూ కలిసి జరుపుకొని సంఘీభావాన్ని ప్రకటించడం ఎంతో ముదావహం.  ప్రత్యేకంగా ముస్లిం సోదరుల పండుగను ఒక తెలుగు సంఘం జరపడం వారియొక్క లౌకికత్వానికి నిదర్శనం.  ఈ విధంగా అన్ని తెలుగు సంఘాలు మనలోవున్న వివిధ మతాలను గౌరవించి అందరినీ కలుపుకుపొతే తెలుగు సంఘాలు మరింత పటిష్టవంతంగా ఎంతో ప్రగతిని సాధించగలవు.

Send a Comment

Your email address will not be published.