రాజకీయాల్లోకి వస్తా

తాను సినిమాలు వదిలేసి పూర్తిగా రాజకీయాల్లోకి రాదలచుకున్నానని జన సేన నాయకుడు, నటుడు పవన్ కళ్యాన్ ప్రకటించారు. 2019 ఎన్నికల్లో తన పార్టీ పోటీ చేస్తుందని కూడా ఆయన మీడియాకు తెలిపారు. తనకు ఇష్టమయిన వృత్తి సినిమాలే అయినప్పటికీ, తాను రాజకీయాల్లో ప్రవేశించి ప్రజాసేవ చేయాలనుకుంటున్నానని ఆయన చెప్పారు. 2019 లోపు ఎన్ని సినిమాలయితే అన్ని సినిమాలు పూర్తి చేస్తానని ఆయన తెలిపారు. తమ జన సేన పార్టీలోకి తన అన్న చిరంజీవి వచ్చే అవకాశం లేదని, రాజకీయంగా తమ దారులు వేరని పవన్ కళ్యాన్ స్పష్టం చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని ఆయన నొక్కి చెప్పారు. జాతీయ సమగ్రత, తెలుగు రాష్ట్రాలకు మేలు చేయడం అనేవి తమ పార్టీ విధానాలని ఆయన వివరించారు.

ప్రజల్లో ఉండాలన్నదే తమ అభిమతమని ఆయన అన్నారు. తాను ప్రస్తుతం చేస్తున్న సినిమాలు అయిపోగానే రాజకీయాల్లో వంద శాతం ప్రవేశించడం జరుగుతుందని పవన్ కళ్యాన్ చెప్పారు.

Send a Comment

Your email address will not be published.