రాజధానికి పునాది రాయి.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాజధాని అమరావతికి జూన్ 6వ తేదీన శంకుస్థాపన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాజధాని నిర్మాణం దసరా నాటికి ఒక కొలిక్కి వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఆ తరువాత నుంచి వరుసగా ప్రభుత్వ కార్యాలయాలను అక్కడికి తరలించే అవకాశం ఉంది. ఈ లోగా వచ్చే నెల రెండవ తేదీ నుంచి ప్రతివారం మూడు రోజుల పాటు విజయవాడలోనూ, మిగిలిన రోజులు హైదరాబాద్ లోనూ ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. వారం పది రోజుల్లో ముఖ్యమంత్రికి విజయవాడలో క్యాంపు కార్యాలయం ఏర్పాటు అవుతోంది. మంత్రులు కూడా అక్కడే తాత్కాలిక కార్యాలయాలు ఏర్పాటు చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. జూన్ నెలాఖరు నుంచి ఉద్యోగుల బదిలీలు కూడా ప్రారంభం అవుతాయని ముఖ్యమంత్రి తెలిపారు.

Send a Comment

Your email address will not be published.