రాజధానిలో జంతు పరిశోధన

హైదరాబాద్ నగరానికి కేంద్ర ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక పరిశోధన సంస్థను మంజూరు చేసింది. ఇప్పటికే ఫార్మా బయో మెడికల్ రంగాల్లో దూసుకుపోతున్న హైదరాబాద్ నగరంలో జంతు పరిశోధనలకు కావాల్సిన జంతువులు, పశువుల ఉత్పత్తి కోసం కేంద్రం నేషనల్ యానిమల్ రిసోర్స్ ఫెసిలిటి ఫర్ బయో మెడికల్ రిసర్చ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నగరంలోని జీనోమ్ వ్యాలీలో సుమారు 340 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. నగరంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని 2002లొ అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని కోరారు. ఎన్డీయే ప్రభుత్వం దానికి ఇప్పుడు అనుమతి మంజూరు చేసింది. ఈ అంతర్జాతీయ స్థాయి పరిశోధన కేంద్రం నాలుగేళ్ళలో నిర్మాణం పూర్తి చేసుకుని పరిశోధనలు ప్రారంభిస్తుంది. ఇక్కడ పరిశోధనలు జరపడానికి వివిధ రాష్ట్రాలతో పాటు, కొన్ని విదేశాలు కూడా ముందుకు వస్తున్నాయి.

Send a Comment

Your email address will not be published.