రాజ్యసభలో ఎందుకు?

తెలంగాణా బిల్లును రాజ్యసభలో పెట్టేందుకు ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారి అభ్యంతరం చెప్పారు. మొదట లోక్సభలో పెట్టకుండా ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశ పెట్టడానికి వీల్లేదని ఆయన ఆ బిల్లును అడ్డుకున్నారు. వాస్తవానికి ఈ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశ పెట్టడానికి రాష్ట్రపతి నుంచి సిఫార్సు కూడా వచ్చింది. అయితే కేంద్ర ప్రభుత్వం దీన్ని ద్రవ్య బిల్లు కింద రాజ్యసభలో పెట్టేందుకు ప్రయత్నించింది. ఈ ప్రత్యేక రాష్ట్ర బిల్లును ద్రవ్య బిల్లుగా ఎలా పరిగణిస్తామని అన్సారీ ప్రశ్నించారు. బీజేపీని ఇరకాటంలో పెట్టేందుకు కేంద్రం ఈ బిల్లును మొదటగా రాజ్యసభలో పెత్తాలనుకున్ది. రాజ్యసభలో బీజేపీకి బలం తక్కువ. మొదట లోక్ సభలో ప్రవేశపెడితే కాంగ్రెస్ ప్రభుత్వానికి బలం తక్కువ, బీజేపీకి బలం ఎక్కువ. ఇప్పుడు తప్పనిసరిగా లోక్ సభలో ఈ బిల్లును ప్రవేశ పెట్టాల్సి ఉంటుంది. అంతకు ముందు ఈ బిల్లు ద్రవ్య బిళ్ళ కాదా అన్నది అటార్నీ జెనరల్ గానీ, లోక్ సభ సభాపతి గానీ తేల్చాల్సి ఉంది.

ఇది ఇలా ఉండగా, లోక్ సభలో గందరగోళం సృష్టిస్తున్న కారణంగా ఆరుగురు సొంత సభ్యులని కాంగ్రెస్ బహిష్కరించింది. వారు: రాయపాటి సాంబశివ రావు, సాయి ప్రతాప్,  లగడపాటి, శ్రీహరి  అరుణ్  కుమార్, హర్షకుమార్  లను  బహిష్కరించారు . వీరు  ఇప్పుడు  లోక్  సభలో  స్వతంత్ర  సభ్యులుగా  కొనసాగుతారు.

Send a Comment

Your email address will not be published.