రామా...రామా... రామా...

ఒంటిమిట్ట కోదండరామాలయం …..ఈ రామాలయానికి ఒక ప్రత్యేకత ఉంది. రాముడు అనగానే హనుమంతుడు అక్కడ ఉండవలసిందే. కానీ ఇక్కడున్న ఆలయంలో హనుమంతుడి విగ్రహం లేకపోవడం ఆశ్చర్యమే. భారత దేశంలోని రామాలయాలలో హనుమంతుడు లేని రామాలయం ఇది ఒక్కటే. ఈ విశేష రామాలయం కడప జిల్లా ఒంటిమిట్టలో ఉంది. ఇక్కడి రామచంద్రమూర్తిని ఆరాధించిన ఇద్దరు గజదొంగలు దొంగతనాలు మాని నిజాయితీపరులుగా మారడం ఒక చరిత్ర, ఆ ఇద్దరు దొంగలలో ఒకడు ఒంటడు. మరొకడు మిట్టడు.

శ్రీరామనవమిఉత్సవాలనుఅధికారికంగానిర్వహించేందుకుఆంధ్రప్రదేశ్ప్రభుత్వం ఈ ఆలయాన్నిఎంపికచేసింది. ఇకనుంచీప్రతిఏటారాష్ట్రప్రభుత్వంఅధికారలాంచనాలతోఇక్కడేశ్రీరామనవమిఉత్సవాలునిర్వహిస్తుంది. ఈసారిఇక్కడముఖ్యమంత్రినారాచంద్రబాబునాయుడుదంపతులకుబదులుగాఉపముఖ్యమంత్రికె.. కృష్ణమూర్తిదంపతులుప్రభుత్వంతరఫునపట్టువస్త్రాలుబహూకరిస్తారు. చంద్రబాబునాయుడుకుమారుడులోకేష్కుకొద్దిరోజులక్రితంఅమ్మాయిపుట్టడంతోచంద్రబాబుమైలలోఉండడంవాళ్ళఆయనఈసారిపటువస్త్రాలుబహూకరించడంలేదు. ఆయనఏప్రిల్రెండునజరిగేశ్రీసీతారాములకల్యాణంలోమాత్రమే  పాల్గొంటారు.

ఈ ఆలయ ముఖద్వారం నూట అరవై అడుగుల ఎత్తు గలది. ఈ ఆలయాన్ని మూడు దశలుగా నిర్మించారు. ఇక్కడి శిల్ప కళ ఎంతో విశిష్టమైనది. ఇక్కడి విగ్రహాలను ఏక శిలలపై   చెక్కడం విశేషం.

పదహారో శతాబ్దంలో ఒక ఫ్రెంచ్ యాత్రికుడు ఇక్కడికి వచ్చాడు. అతని పేరు టావర్నియర్. అతను మన దేశం నుంచి తిరిగి వెళ్ళినప్పుడు రాసిన వ్యాసాల్లో ఈ ఒంటిమిట్ట రామాలయం మన దేశ గొప్ప కట్టడాల్లో ఒకటిగా పేర్కొన్నాడు. అలాగే దేశంలోని అతి పెద్ద గాలిగోపురాల్లో ఈ రామాలయం గోపురం కూడా ఒకటని ఆయన చెప్పాడు.

ఇక్కడి కథకు వస్తే, సీతారాముల పెళ్లి జరిగిన తర్వాత  మహర్షులు మృకండు,  శృంగి దుష్ట శిక్షణ కోసం అర్ధించగా రాముడు సీత, లక్ష్మణులతో లలిసి అంబుల పొది, పిడి బాకు, కోదండం పట్టుకుని యాగ రక్షణ చేసాడు. దీనికి ప్రతిగా మహర్షులిద్దరూ సీతారామలక్ష్మణుల విగ్రహాలను ఏక శిలపై చెక్కి ఆరాధించారు. ఆ తర్వాత జాంబవంతుడు ఈ విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ట చేసాడు.

రాముడితోపాటు ఇక్కడకు వచ్చిన సీత నీటికోసం ఇక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పడంతో రాముడు, లక్ష్మణుడు పాతాళ గంగమ్మ పైపైకి ఉబికి వచ్చేలా బాణాలు వేసారని కథనం. వారి బాణాల వల్ల ఏర్పడిన ఇక్కడి తీర్థాలను రామ, లక్ష్మణ తీర్దాలుగా వ్యవహరిస్తున్నారు. పోతన తన భాగవతం గ్రంధాన్ని ఈకది రాముడికే అంకితం ఇచ్చారని పలువురి మాట. అన్నమాచార్య, పోతులూరి వీరబ్రహ్మం తదితరులుకూడా ఈ స్వామిని దర్శించి కీర్తించినట్టు చరిత్రపుటలు చెబుతున్నాయి.

అలాగే 1640 లో కడపను పరిపాలించిన అబ్దుల్ నబీ ఖాన్ ప్రతినిధి ఇమామ్ బేగ్ ఇక్కడి రాముడంటే విశ్వాసం పెరిగి రామభక్తుడిగా మారి ఒక బావి తవ్వించాడని, ఇప్పటికీ ఇమామ్ బేగ్ అనే పేరుతోనే ఆ బావిని పిలుస్తున్నారని చరిత్ర చెబుతోంది.

ఈ విధంగా ఇన్ని విశేషాలున్న ఈ ఆలయాన్ని జీవితంలో ఒకసారైనా సందర్శించి స్వామివారి అనుగ్రహం పొందాలని ప్రతి భక్తుడు అనుకోవడం అతిశయోక్తి కాదు.

– కళ్యాణీ రెడ్డి

Send a Comment

Your email address will not be published.