రావణాసురుడి ఆలయం

రాముడికి ఆలయాలున్నన్ని కాకపోయినా రావణాసురుడికి కూడా ఒక ఆలయం ఉంది. మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని ప్రాంతంలో ఒక మారోమూల కుగ్రామం చిక్కాలి. ఆ గ్రామ ప్రజలు రావణాసురుడిని తరతరాలుగా ఆరాదిస్తున్నారంటే విచిత్రంగా ఉంది కదూ. కానీ ఇది నమ్మదగ్గ నిజం.  శ్రీలంకలోకూడా రావణాసురుడిని ఈరోజుకీ ఎంతగానో  గౌరవిస్తారు.

రామాయణములో ప్రధాన ప్రతినాయకుడు. రావణాసురుడు. లంకకు అధిపతిగా ఉండిన రావణాసురుడు పది తలలు ఉండటం వల్ల దశముఖుడు అయ్యాడు. అతనిని దశగ్రీవుడు, దశకంథరుడు, దశకంఠుడు అని కూడా పిలుస్తారు. రావణాసురుడి భార్య మండోదరి. ఆమె పతివ్రత, మయుడి కూతురు. రావణాసురుడికి ఏడుగురు కొడుకులు. అతని అమ్మమ్మ తాటకి. అతని  మామ మారీచుడు.

త్రేతాయుగంలో జన్మించిన రావణాసురుడు,  కుంభకర్ణుడుఅన్నదమ్ములు. రావణాసురుడి జన్మవృత్తాంతం స్కాంద పురాణములో ఉంది.

పులస్త్యుని కుమారుడు విశ్వ వసు బ్రహ్మనికి, దైత్య రాకుమారియైన కైకసికి పుట్టిన రావణాసురుడు .

చిన్నతనం నుంచీ తామస స్వభావం కలిగిన వాడే. వేదవిద్యలను తండ్రి విశ్వ వసు బ్రహ్మ నుండి నేర్చుకొని గొప్ప విద్వాంసుడిగా వినుతికెక్కాడు.  తాత సుమాలి వద్ద రాజ్య పరిపాలనా విషయాలు తెలుసుకున్న రావణాసురుడికి చిక్కాలి గ్రామా ప్రజలు ఇక్కడి ఆలయంలో విశేషంగా పూజలు చేస్తారు. ప్రతి ఏడాది చైత్రమాసంలో నవరాత్రులు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. విజయ దశమి పర్వదినాన రావణ ఉత్సవాన్ని ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ఇక్కడి పూజారి పేరు బాబు భాయి రావణ్. ఆయన రావణాసురుడికి అర్చక సేవలు ఎంతో భక్తితో చేస్తారు. ప్రజల కోరిక మేరకు రోజంతా ఏదీ తినకుండా రావణుడికి పూజలు చేయడం విశేషం ఇక్కడి అన్ని ప్రాంతాలలో రావణాసురుడి గడ్డి బొమ్మను బాణాసంచాతో తగలబెడతారు. ఈ గ్రామంలో అతని సంతతికి చెందినా వంశీయులు ఉన్నారని అంటారు. రావణాసురుడితోపాటు ఇక్కడ పూజలు అందుకునే ఒక దేవత కూడా  ఉంది. ఆమె ఒక దేవత. ఆమె ముఖం గాడిద బొమ్మతో ఉంది. ఆమెను ఖరన్న దేవి అంటారు. ఆమెకు పూజలు చేస్తే రావణాసురుడికి ఎంతో సంతృప్తి అని చిక్కాలి ప్రజల మాట.

ఒకమారు ఈ గ్రామంలో వర్షాలు కురవనప్పుడు పూజారి ఒక రోజంతా  ఆహారం తీసుకోకుండా పూజలు చేసాడట. అతనికి చేసిన పూజలతో మూడు రోజులపాటు భారీ వర్షాలు పడ్డాయంట. తాము నమ్ముకున్న రావణాసురుడు నిరాశ పరచక వర్షాలు కురిపించాడని చిక్కాలి ప్రజల ప్రగాడ నమ్మకం.

– కళ్యాణీ రెడ్డి

Send a Comment

Your email address will not be published.