రాష్ట్రంలో కొత్త ముఖ్యమంత్రులు

రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలన్న ఆలోచనకు కేంద్రం స్వస్తి చెప్పింది. ఇక్కడ ప్రభుత్వాన్ని  ఏర్పాటు చేయడానికే నిర్ణయించుకుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ వ్యవహారాలను చూస్తున్న కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ సీమాంధ్ర మంత్రుల్ని , నాయకుల్ని ఢిల్లీ పిలిపించి మంతనాలు జరుపుతున్నారు. మొత్తం 12 మంది మంత్రులు ప్రస్తుతం ఢిల్లీలోనే మకాం  చేసి ఉన్నారు. రాష్ట్రంలో ఏదో ఒక నాయకత్వం కిందే ఎన్నికలు జరిపించాలని, అవసరమయితే కొద్ది కాలం పాటు రాష్ట్ర ఎన్నికలు వాయిదా వేయాలని కూడా కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది.

ఇది ఇలా వుండగా, కొత్త ముఖ్యమంత్రి పదవి మీద చిరంజీవి, బొత్స సత్యనారాయణ, కన్నా లక్ష్మి నారాయణ దృష్టి పెడుతున్నారు. రాష్ట్రంలోని కాపులను ఆకట్టుకోవడానికి కాంగ్రెస్ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్టు కనిపిస్తోంది. కాపులను వెనుకబడిన తరగతుల జాబితాలో చేర్చే ప్రతిపాదనను కూడా పరిశీలిస్తోంది. కాగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన కిరణ్ కుమార్ రెడ్డి మార్చ్ 2న కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉంది. పార్టీ పేరుపై ఆయన తన సన్నిహితులతో చర్చిస్తున్నట్టు తెలిసింది.

Send a Comment

Your email address will not be published.