రాష్ట్రపతి 'శాంతి' ప్రయత్నాలు

హైదరాబాద్ లోని బొల్లారంలో రాష్ట్రపతి భవన్ లో   శీతాకాల విడిది కోసం వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రస్తుతం రాష్ట్రంలో ప్రశాంత పరిస్థితులు నెలకొనడానికి అవిశ్రాంతంగా  ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడికి వచ్చిన నాలుగు రోజుల లోపే ఆయన తెలంగాణా, సీమాంధ్ర ప్రాంతాలకు చెందినా పలు వర్గాలను, పలువురు నాయకులను కలుసుకున్నారు. నిజానికి ప్రధాని గానీ, సోనియా గాంధీ గానీ చేయాల్సిన ప్రయత్నం ఇది. ఈ మధ్య సోనియా గాంధీ స్వయంగా వెళ్లి ఢిల్లీ లో రాష్ట్రపతిని కలిసి రాష్ట్ర పరిస్థితిని చర్చించిన  తరువాత ప్రణబ్ తన శీతాకాల విడిదిని ఇందుకు ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది.

ఆయన ఇప్పటికే తెలంగాణా, ఆంద్ర, రాయలసీమ నాయకులతో ఒక దఫా మాటా మంతీ ముగించారు. ఇందులో భాగంగానే జె.ఎ.సి నాయకుడు కోదండ రాంతో కూడా చర్చలు జరిపారు. తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు చంద్రశేఖర్ రావు కూడా వచ్చి ఆయనను కలిశారు. రెచ్చగొట్టే మాటలు మాట్లాడవద్దని, అన్నదమ్ముల్లా, ప్రశాంతంగా విడిపోవడానికి మార్గం సుగమం చేయాలని ఆయన తెలంగాణా నాయకులకు సూచించారు. ఏమయినా సమస్యలు ఉంటె తనను కలవాల్సిందిగా   ఆయన పలువురు నాయకులకు, వర్గాలకు ఫీలర్స్  పంపిస్తున్నారని తెలిసింది. రాష్ట్రానికి సంబంధించి వివిధ ప్రాంతాల నాయకులు ఇంత వరకూ వందమందికి పైగా ఆయనను కలుసుకున్నారు. ఆయన ఇక్కడ మరో మూడు రోజులు ఉండే అవకాశం ఉంది.

Send a Comment

Your email address will not be published.