రాష్ట్రానికి 'నవ' పద్మాలు

దేశంలో అత్యున్నత పురస్కారాలయిన ‘పద్మ’ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది 128 మంది వ్యక్తుల్ని 127 పద్మ పురస్కారాలకు రాష్ట్రపతి ఎంపిక చేశారు. ఇందులో 2 పద్మవిభూషణ్, 24 పద్మభూషణ్, 101 పద్మశ్రీలున్నాయి. పురస్కారాలకు ఎంపికయినవారిలో 27 మంది మహిళలు కాగా, 10 మంది విదేశీయులు, ఎన్నారైలు ఉన్నారు.

రాష్ట్రానికి రెండు పద్మభూషణ్ లు, ఏడు పద్మశ్రీలు లభించాయి. రాష్ట్రవాసి, అమెరికాలో స్థిరపడిన బయో మెడికల్ పరిశోధన రంగానికి చెందిన డాక్టర్ ముత్తా వంశీకి ఎన్నారై విభాగంలో పద్మశ్రీ లభించింది. కాకినాడకు చెందిన వంశీ ఆరు నెలల వయసప్పుడే తల్లితండ్రుల కారణంగా అమెరికాలో స్థిరపడ్డారు. ఆయన తండ్రి డాక్టర్ ప్రసాద్ టెక్సాస్ లో వైద్యులు. ఇక రాష్ట్రానికి చెందిన పుల్లెల గోపీచంద్ కు బాడ్మింటన్ లో, కీర్తిశేషుడైన డాక్టర్ అనుమోలు రామకృష్ణకు శాస్త్ర సాంకేతిక విభాగంలో పద్మభూషణ్ ప్రకటించారు.

మొహమ్మద్ అలీ బేగ్ కు నాటక రంగంలో, డాక్టర్ అనుమోలు రామారావుకు సామాజిక సేవలో, డాక్టర్ మలపాక యజ్ఞేశ్వర సత్యనారాయణ ప్రసాద్, డాక్టర్ గోవిందన్ సుందర్ రాజన్ లకు శాస్త్రీయ రంగంలో, నర్రా రవికుమార్ కు వ్యాపార పారిశ్రామిక రంగంలో, డాక్టర్ సర్వేశ్వర్ సహారియాకు వైద్య రంగంలో, ప్రొఫెసర్ కొలకలూరి ఇనాక్ కు సాహిత్య రంగంలో పద్మశ్రీలు లభించాయి.

Send a Comment

Your email address will not be published.