రాష్ట్ర గవర్నర్ మధ్యవర్తిత్వం

నదీ జలాలు, హై కోర్టు, ఆర్థిక వనరులు వంటి సమస్యలను పరిష్కరించడానికి తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ నడుం బిగించారు. ఈ రెండు రాష్ట్రాలు చీలిన తరువాత వివిధ సమస్యలు ఈ రాష్ట్రాల మధ్య, ముఖ్యంగా ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులయిన చంద్రబాబు నాయుడు, చంద్రశేఖర్ రావుల మధ్య నిప్పును రాజేశాయి. వీటిని సామరస్యంగా పరిష్కరించి, ఈ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సామరస్యం పెంపొందించడానికి నరసింహన్ కృషి ప్రారంభించారు. అందులో భాగంగా ఆయన ప్రోటోకాల్ ను కూడా పక్కనబెట్టి తాను స్వయంగా విజయవాడ వెళ్లి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలుసుకున్నారు. చంద్రబాబు కూడా ఆయనతో, “మీరే మధ్యవర్తిత్వం వహించండి” అని అభ్యర్థించారు. సమస్యలన్నీ ఒకేసారి పరిష్కారమయ్యేలా చూడాలని కూడా చంద్రబాబు కోరారు. హైద్రాబాద్ వెళ్లిన తరువాత తాను చంద్రశేఖర్ రావు ను కూడా కలుసుకుంటానని, సాధ్యమయినంత త్వరలో సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తానని నరసింహన్ ప్రకటించారు.

Send a Comment

Your email address will not be published.