గ్రేటర్ హైదరాబాద్ రూపు రేఖలు మార్చడానికి, ఈ నగరాన్ని ఒక అంతర్జాతీయ నగరంగా తీర్చి దిద్దడానికి బృహత్ ప్రణాళిక సిద్ధమవుతోంది. ఈ ప్రణాళికను అమలు చేయడానికి ఇరవై వేల కోట్ల రూపాయలు ఖర్చు కాగలవని అంచనా. గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ ప్రత్యేక అధికారి సోమేశ్ కుమార్ ఈ ప్రణాళిక గురించి వివరించారు. ‘గ్రేటర్’ పరిధిలో అంతర్జాతీయ ప్రమాణాలతో 300 కిలోమీటర్ల రోడ్లను అభివృద్ధి చేయడం ఇందులో ఒకటి. సుమారు వంద కిలోమీటర్ల ఎక్స్ ప్రెస్ హైవేలను, నగరంలో 50 కూడలి ప్రాంతాల వద్ద ఫ్లై ఓవర్లను నిర్మించడం జరుగుతుంది. వీటితో పాటు నగరంలో 24 గంటల విద్యుత్, మంచి నీటి సరఫరాలకు కూడా పథకాలు సిద్ధమయ్యాయి. మరో అయిదేళ్ళలో ఈ ప్రణాళిక పూర్తయి నగరం కొత్త శోభను సంతరించుకుంటుందని ఆయన తెలిపారు.