లైలా కోసం చూడొచ్చు...

ఈసారి నాగచైతన్య ఒక  లైలా కోసంతో ప్రేక్షకుల  ముందుకు వచ్చాడు. మూసపోసిన యాక్షన్ తరహా కథలకు కాస్తంత  భిన్నంగా రూపుదిద్దుకున్న చిత్రం ఒక  లైలా కోసం.

నాగచైతన్య, పూజా హెగ్డే, అలీ, సుమన్, సాయాజీ షిండే తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం అనూప్ రూబెన్స్. నిర్మాత అక్కినేని నాగార్జున కాగా కొండ విజయకుమార్ దర్శకత్వం వహించడమే కాకుండా కథ మాటలు స్క్రీన్ ప్లే కూడా ఆయనే సమకూర్చారు.

అక్కడక్కడా తిరిగి తిరిగి ఇంటికి చేరుకున్న నాగచైతన్య ఓ రోజు పూజ హేగ్దేని చూసి తొలి చూపులోనే ప్రేమిస్తాడు. కానీ అనుకోని కారాణాల వల్ల ఆమె అతన్ని ద్వేషిస్తుంది. కానీ పెద్దలు వీరికి పెళ్లి చెయ్యాలని ఒక నిర్ణయానికి వస్తారు.

ఈ క్రమంలో నాగచైతన్య ప్రేమపర్వంలో చవిచూచిన అనుభవాలను ఒక పుస్తకంగా రాస్తాడు. అతను చివరికి ఆమె మనసు ఎలా కట్టిపడేసాడు అనేదే ఈ చిత్ర కథాంశం.

నాగచైతన్య కార్తిక్ పాత్రలో బాగానే నటించాడు. అతను తహన్ పాత్రకు తగిన న్యాయం చేసాడు. పూజా హెగ్డే అందంగా కనిపిస్తుంది. ఆమె నటన రక్తికట్టింది. ఈ నటనతో ఆమె అనతికాలంలోనే గొప్ప నటి కాగలదని అనిపిస్తోంది.

సాయాజీ షిండే పాజిటివ్ రోల్ పోషించారు.

ఈ చిత్రం ఖుషి చిత్రాన్ని తలపిస్తుంది. అయితే కథ అంత బలంగా లేదు. కథానాయిక అపార్ధం చేసుకోవడంగా కథ సాగి చివరకు ఆమె అర్ధంచేసుకోవడంతో  ముగుస్తుంది.

యువతను ఆకట్టుకోవడమే కాకుండా కుటుంబ సభ్యులతో కలిసి చూసే చిత్రంగా దీనిని తీర్చిదిద్దారు. ద్వితీయార్ధంలో స్క్రీన్ ప్లే ఇంకాస్త పట్టుగా ఉంది ఉండవలసింది.

అనూప్ రూబెన్స్ సంగీతం బాగుంది. వినడానికి ఇంపుగా సొంపుగా ఉంది.

Send a Comment

Your email address will not be published.