లోపాయకారీ ఒప్పందం

తెలంగాణా రాష్ట్ర సమితి, కాంగ్రెస్ పార్టీలకు మధ్య లోపాయకారీ ఒప్పందం కుదిరినట్టు కనిపిస్తోంది. అటు విలీనానికి గానీ, ఇటు పొత్తుకు గానీ అంగీకరించని తెలంగాణా రాష్ట్ర సమితితో కాంగ్రెస్ రహస్య ఒప్పందం కుదర్చుకున్నట్టు పరిశీలకులు భావిస్తున్నారు. కేవలం తెలుగుదేశం పార్టీ వోట్లను చీల్చడానికే ఈ రెండు పార్టీలు ఒంటరి పోరాటానికి సిద్ధపడినట్టు పరిశీలకులు చెబుతున్నారు. రహస్య ఒప్పదం ప్రకారం,  కొన్ని నియోజకవర్గాల్లో ఒక పార్టీ మీద మరొక పార్టీ బలహీన అభ్యర్థులను నిలబెట్టడమో, అసలు అభ్యర్థిని పోటీకి పెట్టకపోవడమో జరిగింది. మెదక్ లోక్ సభ నియోజకవర్గానికి అభ్యర్థిగా విజయశాంతిని మొదట నిలబెట్టిన కాంగ్రెస్ చివరి క్షణంలో మెదక్ శాసనసభ స్థానానికి మార్చింది. నిజానికి ఆమె తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు చంద్రశేఖర్ రావు మీద పోటీ చేయాలని భావించింది. ఇదే జరిగితే ఈ రెండు పార్టీల మధ్య సంబంధాలు దెబ్బ తిని ఉండేవి. రాజకీయాలకు కొత్త అయిన శ్రావణ్ కుమార్ రెడ్డిని రావు మీద నిలబెట్టింది. అలాగే సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గంలో రావు కుమారుడు కె.టి. రామా రావు నిలబడుతున్నారు. ఆయన మీద కూడా కాంగ్రెస్ బలహీన అభ్యర్థిని నిలబెట్టింది. ఈ విధంగా సుమారు 20 స్థానాల విషయంలో ఈ రెండు పార్టీలు పరస్పర సహకారం అందించు కొంటున్నాయని తెలిసింది.

Send a Comment

Your email address will not be published.