వందనమో ఉగాది...

క్వీన్స్ లాండ్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో బ్రిస్బన్ నగరవాసులు మరియు క్వీన్స్ లాండ్ రాష్ట్రవాసులు, శ్రీ మన్మధ నామ సంవత్సర ఉగాది వేడుకలు చాలా వైభవంగా ఏప్రిల్ 11, 2015 శనివారం నాడు St John’s Anglican College Auditorium లో జరిగాయి.

400 మందికి పైగా తెలుగు వారు ఈ వేడుకల లో పాల్గొన్నారు.

స్వాగత వచనాలు
సంఘ కార్యదర్శి శ్రీ రాజీవ్ జరుగుల ఆహ్వానం మేరకు సంఘ అధ్యక్షులు శ్రీ ప్రభాకర్ బచ్చు గారు సంఘ సభ్యులకు, పుర ప్రముఖులకు అతిధులకు మరియు విశిష్ట అతిధులు గా భారత దేశం నుండి వచ్చిన సుప్రసిధ్ధ గాయని సునిత గార్కి, ప్రముఖ గాయకులు పార్థు గార్కి మరియు ప్రముఖ సంగీత దర్శకులు ఆర్.పి. పట్నాయక్ గార్కి ఉగాది శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉత్సవాలకు స్వాగతం పలికారు. అనంతరం శ్రీమతి మరియు శ్రీ ప్రకాష్ నల్లమిల గార్లు జ్యోతి ప్రజ్వలన చేసి సంప్రదాయానుసారం ఉత్సవకార్యక్రమలను ప్రారంభించారు. నాటి సాంస్కృతిక కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన కల్చరల్ సెక్రటరీ శ్రీమతి రత్న బుధవరపు మరియూ శ్రీ సురేష్ ధురైస్వామి గారు తమదైన వాక్చాతుర్యంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

నృత్య రూపకం
శనివారం సాయంత్రం లలిత కళాలయవారు ప్రదర్శించిన శాస్త్రీయ ‘స్వాగత నృత్య రూపకం’ ప్రతి ఒక్కరిని మంత్రముగ్ధులను చేసింది. ఈ ప్రదర్శనలో మన తెలుగు సంస్కృతిని కళ్ళకు కటినట్టుగా చూపించారు కళాకారులు. ఈ రూపకాన్ని ప్రదర్శించిన పద్మలక్ష్మి వారి శిష్యు రాలు శివాని శ్రీరాం ను ప్రేక్షకులందరూ కరతాళ ధ్వనులతో కొనియాడారు. గాయిత్రి అంపొలు ఆలపించిన కీర్తన, శ్రీ వర్ణిత బచ్చు,స్వాతి జొన్నలగడ్డ, శ్రీనివసాచారి కిడాంబి గార్లు ఆలపించిన చలన చిత్ర గీతాలు ఆహూతలందరినీ ఆకట్టుకున్నాయి.

“తెలుగు బడి” చిన్నారులు
“తెలుగు బడి” చిన్నారులు అశ్విక్ బాలజి, శృతి పూడిపెద్ధి, లహరి గూడూరు ఆలపించిన శ్లోకము, హేమిత్ అశ్విక్ బాలజి హేమాల్ అనీష్ శృతి పూడిపెద్ధి పృథ్వి గూడూరు కెన్న్యా లరా చేసిన “ఉగాది పచ్చడి” దృశ్య రూపకం , కృతిక వల్లూరి క్షితి రావ్ శృతి పూడిపెద్ధి అశ్విక్ బాలజి డాన్సు మెడ్లీల సందడుల తో, హృదయ బుధవరపు రమ్య రాపర్తి సాహిత్య ఆరుగొండ ల నృత్య ప్రదర్సనల తో ముందుకు సాగుతూ 4 గంటల పాటు నిర్విరామంగా సాగిన నాటి కార్యక్రమంలో సునిత గారు, పార్థు గారు మరియు ఆర్.పి. పట్నాయక్ గారు కలసి ఆలపించిన చలనచిత్ర గీతాలు ప్రేక్షకులను ఉత్తేజ పరిచి ప్రతి ఒక్కరిని మంత్రముగ్ధులను చేసాయి. ప్రేక్షకులందరూ ముక్తకంఠంతో , కరతాళ ధ్వనులతో కొనియాడారు.

కృతజ్ఞతలు
నాటి కార్యక్రమములలో భాగంగా కల్ల ప్రసాద్, రాం కర్రి మరియు పురుషొత్తమ నాయుడు బొడపాటి గార్లు విశిష్ట అతిధు లైన సునిత, పార్థు ఆర్.పి. పట్నాయక్ గార్లను సత్కరించారు. హాట్ మైల్డ్ మీడియం రెస్టారంట్ బాల్తి రెస్టారంట్ మరియు కర్రి హెవెన్ రెస్టారంట్ వారు, విచ్చేసిన ఆహుతులకు రుచికరమైన భోజనాన్ని అందించారు. కార్యవర్గ సభ్యు లైన హరిష్ చిలకలపూడి అనూప్ నన్నూరూ నవనీతా రెడ్డి గార్లు ఈ కార్యక్రమమునకు సాంకేతిక సహాయము అందించారు. శ్రీనివాస్ సాదం, కృష్ణ రావు మాదాల రాం ఎలిమిసెట్టి మహేశ్వర్ రెడ్డి హరినథ్ గార్లు తగు విధముగా తమవంతు సహయసహకారములను అందించి కార్యక్రమమును ముందుకు నడిపారు. ఎంతో కృషిని , సమయాన్ని వెచ్చించి నాటి వేడుకలను విజయవంతం చేసిన ప్రదర్సకులకు , వారి తల్లితండ్రులకు , విచ్చేసిన ప్రేక్షకులకు , వాలంటీర్లకు , కార్యవర్గ సభ్యులకు , మరియు దాతలకు , సంఘ ఉపాధ్యక్షులు శ్రీ సుదర్శన్ కంతకడి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ వందన సమర్పణ తో ముగించారు.

Send a Comment

Your email address will not be published.