వికసించిన తెలుగు పద్మాలు

తెలుగు రాష్ట్రాల నుంచి నలుగురికి ‘పద్మ’ పురస్కారాలు లభించాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుంచి ప్రముఖ నటుడు కోట శ్రీనివాస రావుకు పద్మశ్రీ అవార్డు లభించింది. తెలంగాణా రాష్ట్రం నుంచి డాక్టర్ అనగాని మంజుల, క్రికెట్ క్రీడాకారిణి మిథాలీ రాజ్, బాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధూలను పద్మశ్రీ వరించింది. అమెరికాలో స్థిరపడిన ప్రముఖ వైద్యులు నోరి దత్తాత్రేయుడు, డాక్టర్ రఘురాం పిల్లారిసెట్టిలకు ఎన్నారై కోటాలో పద్మశ్రీ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

ఇక గత నాలుగు దశాబ్దాలుగా చెన్నైలో స్థిరపడిన విజయనగరానికి చెందినా మహిళ, ప్రముఖ వయొలిన్ విద్వాంసురాలు అవసరాల కన్యాకుమారికి తమిళ నాడు ప్రభుత్వ ప్రతిపాదన మేరకు పద్మశ్రీ ఇచ్చారు. ఢిల్లీ లోని ఆర్ ఎం ఎల్ ఆస్పత్రిలో పనిచేస్తున్న చిక్కాల జయకుమారికి ఢిల్లీ ప్రభుత్వ ప్రతిపాదన మేరకు పద్మశ్రీ లభించింది. అనగాని మంజుల హైదరాబాద్ నగరంలో మహిళా వైద్య నిపుణురాలిగా పని చేస్తున్నారు. ఆమె మూల కణాల ద్వారా ఎండో మెట్రియం చికిత్స ప్రక్రియను విజయవంతం చేశారు. డాక్టర్ రఘురాం క్యాన్సర్ వ్యాధి నిపుణుడు.

మొత్తం మీద తెలుగు రాష్ట్రాలకు పద్మశ్రీలు తప్ప పద్మ భూషణ్ గానీ, పద్మ విభూషణ్ గానీ లభించ లేదు. మైక్రో సాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ దంపతులకు పద్మభూషణ్, ఎల్కే ఆద్వానీ, అమితాబ్ బచ్చన్, దిలీప్ కుమార్ లకు  పద్మ బిభూషణ్ పురస్కారాలు ప్రకటించారు. ఈ పురస్కారాలను రాష్ట్రపతి మార్చ్, ఏప్రిల్  నెలల్లో అందజేస్తారు.

Send a Comment

Your email address will not be published.