వి'భజన' పూర్తి

ఆంధ్ర ప్రదేశ్ విభజన పూర్తయిపోయింది. ఇంకా ఆరు దశాబ్దాలైనా పూర్తి కాక మునుపే రాష్ట్రం రెండుగా చీలిపోయింది. రాష్ట్ర విభజనకు ఈ రోజు మోజు వాణీ ఓటుతో లోక్ సభ ఆమోదం తెలియజేసింది. రేపు గానీ, ఎల్లుండి గానీ రాజ్యసభలో కూడా ఈ విభజన బిల్లు ఆమోదం పొందుతుంది. ఆ తరువాత రాష్ట్రపతి ఆమోద ముద్ర పడుతుంది. అంతటితో విభజన అధికారికంగా పూర్తయినట్టే. అంతవరకూ సమన్యాయం కోసం పట్టుబడుతున్న బీజేపీ కూడా విభజనకు ఆమోదం తెలిపింది. ాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ (2014) బిల్లును కేంద్ర ప్రభుత్వం అంతకు ముందు లోక్ సభలో ప్రవేశ పెట్టె ముందు 35 సవరణలను ఆమోదించింది. అందులు ఈ రెండు రాష్ట్రాలకు పదేళ్ళ పాటు హైదరాబాద్ నగరం ఉమ్మడి రాజధానిగా ఉంటుందని, పోలవరం ముంపు జలాలు సీమాంధ్ర ప్రాంతానికే  చెందుతాయని,  ఆంద్ర, రాయలసీమ ప్రాంతాలకు కలిపి ఆర్ధిక ప్రయోజనాలను  ప్యాకేజీ రూపంలో అందిస్తామని అది తెలిపింది. రాష్ట్ర విభజన జరిగిపోయినట్టు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ సీమాంధ్ర సభ్యుల అరుపులు, కేకల మధ్య ప్రకటించి సభ నుంచి వెళ్ళిపోయారు. ఆ వెనుకనే ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా సభ నుంచి నిష్క్రమించారు. అంత వరకూ లోక్ సభ కార్యక్రమాలను టీవీ చానల్స్ లో చూపిస్తున్న లోక్ సభ కార్యాలయం, తీరా ఈ కార్యక్రమాన్ని మాత్రం అర్థాంతరంగా నిలిపివేసింది. ఇంతకన్నా ప్రజాస్వామ్య వ్యతిరేక చర్య మరొకటి ఉండదని కాంగ్రెస్ మంత్రి చిరంజీవి వ్యాఖ్యానించారు. సీమాంధ్ర సభ్యులు సృష్టిస్తున్న గందరగోళం మధ్య జగన్ పార్టీ, మార్క్సిస్ట్ పార్టీల సభ్యులు సభ నుంచి వాకవుట్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని నిలువునా ఖూనీ చేశారని జగన్ విమర్శించారు.

ఇది ఇలా వుండగా తెలంగాణా రాష్ట్రాన్ని సాధించుకున్నందుకు ఆ ప్రాంతంలోని వారంతా సంబరాలు జరుపుకుంటుండగా సీమాంధ్ర ప్రాంతంలో రేపు బంద్ కు పిలుపునిచ్చారు.

Send a Comment

Your email address will not be published.