విమానాశ్రయాలు కిటకిట

Airplane picతెలుగు రాష్ట్రాలయిన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లలో విమానయానం బాగా జోరందుకుంది. నాలుగేళ్ల క్రితం విజయవాడ విమానాశ్రయం బోసిపోతూ ఉండేది. ఇప్పుడు ఏడాదికి అక్కడి నుంచి ఆరు లక్షలమంది ప్రయాణిస్తున్నారంటే ఆశ్చర్యం కలుగుతుంది. వైజాగ్ లోను అది పది లక్షలు దాటింది. హైదరాబాద్ లో కూడా ప్రయాణికుల సంఖ్య కోటిన్నర దాటేసింది. దేశ విదేశీ ప్రయాణాల్లో మనవాళ్లదే అగ్రస్థానం. తెలుగు రాష్ట్రాల్లో విమానయానంపై మక్కువ పెరుగుతోంది. అమెరికా, ఆస్ట్రేలియాలే కాదు, హైదరాబాద్ నుంచి రాజమండ్రికి, విశాఖకు వెళ్ళడానికి కూడా విమాన యానాన్నే ఎంచుకుంటున్నారు. కనెక్టివిటీ పెరగడంతో పాటు, విమానయానం చౌకగా ఉండడం కూడా ఇందుకు కారణం. ఇది ఇలా ఉండగా, తిరుపతి, గన్నవరం (విజయవాడ) విమానాశ్రయాలకు అంతర్జాతీయ హోదా కల్పిస్తూ కేంద్రం రాజపత్రం జారీ చేసింది.

Send a Comment

Your email address will not be published.