విరబూసిన తెలుగు పద్మాలు

కేంద్రప్రభుత్వం కళలు, సామాజిక సేవ, వాణిజ్యం, పరిశ్రమలు, వైద్యం, సాంకేతికం, వాణిజ్యం, ప్రజావ్యవహారాలు, విద్య, సాహిత్యం, క్రీడలు తదితర రంగాలలో అత్యుత్తమ సేవలు అందించే భారతీయులకు ఇచ్చే పద్మ పురస్కారాలకోసం ఈసారి వంద మందికిపైగానే ఎంపిక చేసింది.

దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ తో పాటు పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులకు ఎంపికైన వారి వివరాలను కేంద్రప్రభుత్వం విడుదల చేసింది. వారిలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురికి ఈ సారి ఈ గౌరవ పురస్కారాలు లభించాయి.

పద్మవిభూషణ్ కు ఎంపికైన వారిలో రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీ రావు, భారత నాట్య, కూచిపూడి కళాకారిణి యామినీ కృష్ణమూర్తి ఉండటం విశేషం.

పద్మభూషణ్ పొందిన వారిలో క్రీడాకారిణులు సానియామీర్జా, సైనా నెహ్వాల్, ప్రముఖ రచయిత యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, ప్రముఖ వైద్యులు డీ నాగేశ్వర రెడ్డి, ప్రముఖ శాస్త్రవేత్త ఏ వీ రామారావు ఉన్నారు.

ఇక పద్మశ్రీ అవార్డు అందుకోనున్న వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందినా ప్రముఖుల్లో సినీ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి, డాక్టర్ మన్నం గోపీచంద్, డాక్టర్ ఆళ్ళ గోపాలకృష్ణ గోఖలే, లక్ష్మాగౌడ్, యార్లగడ్డ నాయుడమ్మ, టీ వీ నారాయణ, సునీత కృష్ణన్ ఉన్నారు.

దేశం మొత్తం మీద రామోజీరావు, రజనీకాంత్ లతోసహా పది మందికి పద్మవిభూషణ్, సానియా మీర్జా, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ లతోసహా 19 మందికి పద్మభూషణ్, ఎస్ ఎస్ రాజమౌళి, ప్రియాంకా చోప్రా, అజయ్ దేవగన్ లతో సహా మొత్తం 83 మందికి పద్మశ్రీ లభించాయి. మొత్తం 112 మందికి పద్మ పురస్కారాలు లభించగా వారిలో పందొమ్మిది పురస్కారాలు మహిళలకు, పది విదేశీయులు, ప్రవాస భారతీయులకు, నలుగురు దివంగత వ్యక్తులకు లభించాయి.

దివంగతులైన వారిలో ధీరూభాయి అంబానీకి పద్మవిభూషణ్, స్వామీ దయానంద్ సరస్వతికి పద్మభూషణ్ పురస్కారం ప్రకటించారు.

వచ్చే మార్చి లేదా ఏప్రిల్ నెలలో డిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో జరిగే ఒక కార్యక్రమంలో ఈ పద్మా పురస్కారాలను ప్రదానం చేస్తారు.

Send a Comment

Your email address will not be published.