విలీనానికి గులాబీ పార్టీ 'నో'

తెలంగాణా రాష్ట్రాన్ని ప్రకటించే వరకూ తెలంగాణా రాష్ట్ర సమితి అధినేత కె. చంద్రశేఖర్ రావు తమ పార్టీని కాంగ్రెస్ పార్టీతో విలీనం చేయడంపై ఊరిస్తూ వచ్చారు. కాంగ్రెస్ ఆదిస్థానం తెలంగాణా రాష్ట్రాన్ని ప్రకటించిన తరువాత ఆయన మాట మార్చారు. తమ పార్టీని కాంగ్రెస్ పార్టీతో విలీనం చేసే ప్రసక్తి లేదని ఆయన నిన్న ఓ సమావేశంలో తెగేసి చెప్పారు. “తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్రాని పునర్నిర్మించడంలో మన పార్టీ కీలక పాత్ర పోషించాల్సి ఉంది. ఈ ప్రాంతాన్ని పునర్నిర్మించడం మన పార్టీ చారిత్రక బాధ్యత. ఈ ప్రాంతం సంపన్నవంతం అయ్యే వరకూ మనం నిద్ర పోకూడదు” అని ఆయన తన సహచరులకు చెప్పారు.ఆయన మాటలు కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బే.

రాష్ట్రంలో తమకు సరైన నాయకత్వాన్ని అందించాలని, దిశా నిర్దేశం చేయాలని తెలంగాణా ప్రజలంతా ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారని, రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చేదాలని ఆశిస్తున్నారని కె.సి.ఆర్ అన్నారు. 2014లో అటు రాష్ట్ర శాసనసభకు, ఇటు లోక్ సభకు ఒకేసారి జరిగే ఎన్నికల్లో తెలంగాణా రాష్ట్ర సమితితో కలిసి పోటీ చేయాలన్న కాంగ్రెస్ ఆశలపై ఆయన వ్యాఖ్యలు నీళ్ళు చల్లినట్టయింది.

Send a Comment

Your email address will not be published.