విశాఖలో ఆగస్టు 15 వేడుకలు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఈసారి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను నిర్వహించాలని ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిర్ణయించింది. పలు ప్రభుత్వ కార్యక్రమాలను ఇక నుంచీ ఆంధ్ర ప్రదేశ్ లోనే ఇతర ప్రాంతాల్లో నిర్వహించాలని ఇదివరకే విధాన నిర్ణయం తీసుకున్న చంద్రబాబు ప్రభుత్వం జాతీయ పతాకాన్ని ఆగష్టు 15న విశాఖపట్నం లో నిర్వహించేందుకు ఏర్పాట్లు ప్రారంభించింది. చంద్రబాబు నాయుడు బుధవారం నాడు రాజమండ్రిలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. దసరాల్లో కొత్త రాజధానికి శంకుస్థాపన చేస్తామని, ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు, సింగపూర్ ప్రధాని, జపాన్ ప్రధాని కూడా పాల్గొంటారని చంద్రబాబు తెలిపారు.

Send a Comment

Your email address will not be published.