వేగంగా నిర్మాణం పనులు

ఆంధ్ర ప్రదేశ్ కొత్త రాజధాని అమరావతి నిర్మాణం పనులు ఊపందుకున్నాయి.

ప్రధాని నరేంద్ర మోడీ గత విజయ దశమి రోజున శంకుస్థాపన చేసిన తరువాత నుంచీ అతి వేగంగా నిర్మాణం పనులు మొదలయ్యాయి. రాజధాని నిర్మాణానికి కావాల్సినంత సహాయం అందజేస్తామని మోడీ భరోసా ఇచ్చిన తరువాత అతి త్వరలో వివిధ విభాగాల కింద కేంద్రం నుంచి కోట్లాది రూపాయలు మంజూరు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ ధైర్యంతోనే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు మంత్రులు అధికారులతో సమీక్షించి నిర్మాణం పనుల వేగం పెంచడానికి ఆదేశాలు జారీ చేశారు. అంతే కాక ఆయన స్వయంగా వెయ్యి కోట్లు ఈ నిర్మాణం పనులకు కేటాయించారు. నిర్మాణం పనులను పర్యవేక్షించడానికి ఆయన మంత్రులు, అధికారులతో ఒక కమిటీని కూడా నియమించారు. జూన్ 2 లోగా అంటే, కొత్త రాష్ట్రం ఏర్పడిన రోజు లోగా గరిష్ట స్థాయిలో ప్రభుత్వ కార్యాలయాలను, అధికారులను, సిబ్బందిని కొత్త రాజధానికి తరలించాలని కూడా ఆయన కృత నిశ్చయంతో ఉన్నారు. ఇది ఇలా ఉండగా, వచ్చే శాసనసభ సమావేశాలను ఈసారి విజయవాడ, గుంటూరు నగరాల మధ్య నిర్వహించాలని స్పీకర్ కోడెల శివప్రసాద రావు భావిస్తున్నారు.

Send a Comment

Your email address will not be published.