వేర్వేరు గవర్నర్లు

governorsప్రస్తుత గవర్నర్ నరసింహన్ స్థానంలో త్వరలో రెండు తెలుగు రాష్ట్రాలకు వేర్వేరుగా ఇద్దరు గవర్నర్లను నియమించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

ఇందులో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి గవర్నరుగా గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి ఆనందీ బెన్, తెలంగాణ రాష్ట్రానికి గవర్నరుగా కర్ణాటకకు చెందిన బీజేపీ నేత, అక్కడి శాసనమండలి చైర్మన్ డీ. హెచ్. శంకరమూర్తిని నియమించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఈ గవర్నర్ల నియామకం విషయంలో ఇప్పటికే ఈ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల అభిప్రాయాన్ని కూడా తీసుకున్నట్టు తెలిసింది. ప్రస్తుత గవర్నర్ నరసింహన్ పదవీ కాలం గత మార్చితోనే ముగిసింది. అయితే కొత్త గవర్నర్ల నియామకం జరిగే వరకూ పదవిలో కొనసాగాలని కేంద్రం నరసింహన్ కు సూచించింది. రాష్ట్రపతిగా రామనాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారానికి వచ్చిన కె.సి.ఆర్, చంద్రబాబు నాయుడులకు ప్రధాని నరేంద్ర మోడీ ఈ కొత్త గవర్నర్ల విషయం తెలియజేసినట్టు, ముఖ్యమంత్రులు అంగీకరించినట్టు తెలిసింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తరువాత ఈ నియామకాలు జరపాలని కేంద్రం భావిస్తోంది. ప్రస్తుతం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి.

Send a Comment

Your email address will not be published.