శిఖరాగ్రాన బాలికలు

Mt Elbrusఆ బాలికల సాహసాలు అసామాన్యం. ఐరోపాలోనే అత్యంత ఎత్తయిన శిఖరం రష్యాలో ఉంది. దాని పేరు మౌంట్ ఎల్ బ్రాస్. నిజామాబాదుకు చెందిన మాలావత్ పూర్ణ, బొల్లెద్దు శ్రీవిద్య అనే బాలికలు ఈ శిఖరాగ్రానికి చేరుకొని అక్కడ త్రివర్ణ పతాకాన్ని రెప రెప లాడించారు. ఈ బాలికలు ఇదివరకే ఎవరెస్ట్, కిలిమాంజారో అధిరోహించి రికార్డు సృష్టించారు. శేఖర్ బాబు అనే ప్రఖ్యాత పర్వతారోహకుని ఆధ్వర్యంలో పూర్ణ, శ్రీవిద్యతో పాటు విశాఖ జిల్లా బంగారుపాలెంకు చెందిన ఎం. సత్యారావు, పుణెకు చెందిన వర్ష, గుంటూరు జిల్లాకు చెందిన రఘునాథ్ గురువారం నాడు భారత కాలమానం ప్రకారం ఉదయం 9.20 గంటలకు పర్వత శిఖరం పైకి చేరుకొని జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. ఇందులో శ్రీవిద్య తెలంగాణ ముఖ్యమంత్రి కె.సి.ఆర్ చిత్ర పాఠాన్ని కూడా ప్రదర్శించింది.

Send a Comment

Your email address will not be published.