శ్రావణ పూర్ణిమ – రక్షా బంధన్ !!

శ్రావణ మాసంలో పూర్ణిమ నాడు జరుపుకునే రక్షాబంధననే రాఖీ పూర్ణిమ అని అంటారు. జంధ్యాల పూర్ణిమ కూడా ఈ రోజు జరుపుకోవడం సంప్రదాయం.

Raksha-Bandhan2017రాఖీ పూర్ణిమ రోజు సోదరితో రక్షా కట్టించుకుంటే అందరు దేవతల రక్షణ కలుగుతుందని ఓ విశ్వాసం. సోదరి సోదరుల మధ్య ప్రేమాను రాగాలకు సంకేతంగా కూడా ఈ పండగను జరుపుకోవడం కద్దు. మన భారతీయ సంప్రదాయం ప్రకారం ఇంటి ఆడపడుచు శక్తి స్వరూపానికి ప్రతీక. అంతేకాదు, సాక్షాత్తూ శ్రీమహాలక్ష్మికి ప్రతిరూపం. అంతటి శక్తి కలిగిన సోదరితో సోదరుడు రక్షాన బంధన్ కట్టించుకుంటే అరిష్టాలన్నీ తొలగిపోతాయని, దేవతలు అనుగ్రహిస్తారని మన ప్రాచీనులు ఈ సంప్రదాయాన్ని ఏర్పాటు చేసారు. ఒకప్పుడు మన దేశంలో ఉత్తర, పశ్చిమ ప్రాంతాలలో మాత్రమే ఈ పండుగ వాడుకలో ఉండేది. అయితే కాలక్రమేణా ఈ పండగ దేశంలోని అన్ని మూలలకూ విస్తరించింది. ఇది మహత్తరమైన పండగగా మారింది.

చరిత్ర పుటలు తిరగేస్తే రాఖీకి సంబంధించి ఓ కథ వాడుకలో ఉండటం తెలుస్తుంది. అదెంటో చూద్దాం….

పూర్వం సురులకూ, అసురులకూ మధ్య దీర్ఘకాలం యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో దేవతల రాజు దేవేంద్రడు ఓడిపోయాడు. దానితో అతను రాజ్యాన్ని కోల్పోయి తన వారితో కలిసి అమరావతికి వెళ్లి అక్కడే తలదాచుకుంటాడు. తన భర్త పరిస్థితిని గమనించి భార్య ఇంద్రాణికి ఓ ఆలోచన వస్తుంది. రాక్ష రాజు పై దాడికి భర్తను రెచ్చగొడుతుంది. చూస్తూ కూర్చుంటే లాభం లేదని చెప్తుంది. వెళ్లి యుద్ధం చేయమని చెప్తుంది. ఇంద్రాణి ఆది దంపతులు అయిన పార్వతీ పరమేశ్వరులకు, లక్ష్మీనారాయణులకు పూజ చేసి రక్షాబంధన్ ని భర్త దేవేంద్రుడి చేతికి కడుతుంది. అలాగే దేవతలు కూడా రక్షలతో వచ్చి దేవేంద్రుడి చేతికి కడతారు. రాక్ష రాజుపై యుద్ధంలో దేవేంద్రుడు గెలిచి ముల్లోకాలపై పట్టు సంపాదిస్తాడు. అలా అప్పుడు ఇంద్రాణి కట్టడం ప్రారంభించిన రక్షా విధానం రాఖీపండుగాగా వాడుకలోకి వచ్చింది. అలాగే ఇందుకు సంబంధించి మరికొన్ని పౌరాణిక గాధలు ప్రచారంలో ఉన్నాయి.
ఇక ఇప్పటి చరిత్రకు వస్తే అలెగ్జాండర్ భార్య రోక్శానా తక్షశిల రాజు పురుషోత్తముడిని తన సోదరుడిగా భావించి రాఖీ కట్టింది. అది క్రీస్తు పూర్వం 326 వ సంవత్సరం. రోక్సానాను పెళ్లి చేసుకున్న అలెగ్జాండర్‌ మధ్య ఆసియాలో అనేక ప్రాంతాలను ఆక్రమించాలని అనుకుంటాడు. ఈ క్రమంలోనే అతను భారతదేశం మీద కూడా దండయాత్ర చేస్తాడు. అయితే అలెగ్జాండర్‌ పై యుద్ధంలో పురుషోత్తముడు గెలవాలనే ఆమె రాఖీ కడుతుంది. తన సోదరుడైన పురుషోత్తముడిని హత మార్చ వద్దని ఆమె తన భర్త అలెగ్జాండర్‌ను కోరుతుంది. భార్య మాటగా అలెగ్జాండర్‌ యుద్ధం మానుకుంటాడు.

రాఖీ పండగతో సమాజంలో అందరూ ఒకరికొకరు తోబుట్టువుల వంటి వారని అర్థం చేసుకోవాలి. సామాజికంగా స్త్రీ పురుషుల మధ్య ప్రేమానురాగాలు వెల్లివిరియాలని అంతరార్థం.

ఇలాఉండగా, ఈ పౌర్ణమి రోజునే దేవతారాధన, జపం, స్తోత్ర పారాయణం వంటివి సత్ఫలితాలు ఇస్తాయి. ఈ రోజున దక్షిణ భారతదేశంలో యజ్ఞోపవీతం ధరించే బ్రాహ్మణులు జంధ్యాలు మార్చుకుంటారు. కొత్తగా ఉపనయనం జరిగిన వారికి ఈరోజున ఉపాకర్మ జరిపిస్తారు. అందుకే జంధ్యాల పూర్ణిమ అనే పేరు వచ్చింది.

Send a Comment

Your email address will not be published.