శ్రీధర్ పై ఎందుకీ కక్ష?

రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు అధీనం నుంచి శాసన సభా వ్యవహారాలను తొలగిస్తూ ముఖ్యమంత్రి ఎన్. కిరణ్ కుమార్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడం సంచలనం కలిగిస్తోంది. మరో రెండు రోజుల్లో శాసనసభ మళ్ళీ సమావేశం కాబోతుండగా కిరణ్ ఈ చర్యకు పాల్పడడం ఆశ్చర్యపరుస్తోంది. శ్రీధర్ తెలంగాణా ప్రాంతానికి చెందినా వారు అయినందువల్ల, తెలంగాణా బిల్లు శాసనసభ ముందుకు రానున్నందువల్ల కిరణ్ ఇటువంటి చర్య తీసుకున్నట్టు తెలంగాణా ప్రాంత కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. తెలంగాణా బిల్లు సభ ముందుకు రాకుండా చేయడానికే కిరణ్ శ్రీధర్ బాబును పక్కన పెట్టారన్నది  అర్థమవుతూనే ఉంది. కిరణ్ చర్యకు సంబంధించిన ఫైల్ తన దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని పెండింగ్ లో పెట్టాల్సిందిగా అధిష్టానం రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ను ఆదేశించినట్టు తెలిసింది. కాగా, కిరణ్ తనను అన్యాయంగా శాసనసభ వ్యవహారాల నుంచి తొలగించినట్టు శ్రీధర్ కూడా అధిష్టానానికి ఫిర్యాదు చేశారు.

శాసన సభ వ్యవహారాలను శ్రీధర్ నుంచి తప్పించిన కిరణ్ ఆయనకు వాణిజ్య శాఖను అప్పగించారు కానీ, శ్రీధర్ ఆ శాఖను తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. తెలంగాణా ప్రాంతానికి చెందినా కాంగ్రెస్ నాయకులు కిరణ్ ఏమి చేసినా అది నో-బాల్ కిందకే వస్తుందని వ్యాఖ్యానించారు.

Send a Comment

Your email address will not be published.