శ్రీ పార్వతీ కళ్యాణం – పరమ శివ వైభోగం

మాస్టర్ పీస్ అని ఒకరంటే అద్బుతః అని వేరొకరు…
DSC_8193-1
DSC_7751-1
pk2
శివుడు నిర్గుణుడు. నిర్మలుడు. నిరంజనుడు. నిరాకారుడు. నిరాశ్రయుడు. నిరతిశయ అద్వైత పరమానంద స్వరూపుడు. పరమేశ్వరుడు చైతన్య స్వరూపుడు. ఆదిదేవుడు.

అట్టి ఆది దేవునికి అమ్మవారితో దివ్యమైన కళ్యాణం తలపెట్టడమే ఒక కల. ఆ కలని సాకారం చేసుకోవడానికి అన్ని హంగులు చేకూర్చుకొని రంగస్థలంపై ప్రదర్శన నివ్వడం ఒక కళ.

కైలాసం నుండి ఆ నిర్వికారుడు దేశం కాని దేశం వచ్చి అందరినీ అబ్బుర పరిచాడు. సతీ దేవి శివమెత్తి అగ్ని కీలల్లో ఆహుతై అమ్మవారిని తలపింపజేసింది. నారద మహర్షి ఆద్యంతము తన నటనా ప్రతిభతో త్రిలోకాలను దర్శింపజేశాడు. వీరభద్రుడు విరిచిపడి భయాందోళనలు సృష్టించాడు. దక్షుడు విశ్వ నట చక్రవర్తి శ్రీ ఎస్వీ రంగారావునే గుర్తుకు తెచ్చాడు. బ్రహ్మ, విష్ణు, సరస్వతి, లక్ష్మి మరియు ముని గణ వర్గం వారి నటనా సామర్ద్యంతో ప్రేక్షులను ఉవ్విళ్ళూరించారు.

పర్వత రాజ దంపతులు మెల్బోర్న్ నగరాన్ని పునీతం చేసారు. పార్వతీ దేవి తన పాత్రలో లీనమై తెలుగువారి హృదయాలలో సుస్థిర స్థానాన్ని చేజిక్కించుకుంది. మన్మధా! నీ పూల బాణాలకు ప్రేమ పారవశ్యంతో ఈశ్వరుడు కూడా చలించాల్సిందే. చెలికత్తెలు తమ నృత్యగానంతో ప్రేక్షుకులను మంత్ర ముగ్దులను చేసారంటే చాలా తక్కువ చెప్పినట్లే. శివ యోగి పార్వతీ దేవిని పరీక్షించడంలో సఫలీకృతుడయ్యాడు.
MC
మొదటి సీను రూపకల్పన , సమాధి నిష్ట శివారాధనా నృత్య గీత వేద పఠనా యుత స్తుతి మెల్భరునుకు కైలాసమే దిగివచ్చినదా అనే దివ్యానుభూతి కలిగిందని చాలా రసజ్ఞులయిన ప్రేక్షకుల ఉవాచ.

రచనలో శివపురాణ కీలక విషయ సేకరణ, అద్దాని యథాతథ అనుసరణ,’ త్రిమూర్తుల నేపధ్య దివ్య గళోచ్చారణములు, దివ్య తత్వబోధకు దీటయిన పద్య కట్టులు, సరసముద్రా సహిత హావభావ ప్రకటనలు….. బాలికా బృందభక్తి పూరిత గీత నృత్యాభినయములు – … మొదటి సీనుకు ఆయువుపట్టు లయి అలరించనవని ప్రేక్షక లోక వాణిDSC_7896-1
pk4
DSC_7975-1
రచయితల మేధా సంపత్తికి, నటీనటుల అభినయ ప్రతిభకి, నృత్యకళాకారుల నాట్య ప్రదర్శనకు, దర్శకుల రూపకల్పనకు ఒక ఆద్భుతమైన కళాఖండం “శ్రీ పార్వతీ కళ్యాణం”. ఇంతటి మహత్తరమైన ఖండకావ్యం మెల్బోర్న్ నగర వాసులే తమ ప్రతిభకు సవాలు చేస్తూ మొదటిసారిగా ఆస్ట్రేలియా దేశంలో దృశ్యకావ్యముగా రూపొందించి రంగస్థల ప్రదర్శనగా రూపు దిద్దడం ఇక్కడి తెలుగువారి కళా ప్రతిభకు తార్కాణం.

సందర్భానుసారంగా కొన్ని నృత్యగీతాలను అన్వయించి కధాంశాన్ని నడిపించిన తీరు ఎంతో శ్లాఘనీయం.

pk5
pk6
ముఖ్యంగా శివ పురాణం ఆధారంగా కొన్ని నాటక ప్రతులననుసరించి శ్రీ కొంచాడ మల్లికేశ్వర రావు, శ్రీ సూర్యనారాయణ సరిపల్లె మరియు శ్రీ రాంప్రకాష్ యెర్రమిల్లి కధను వ్రాయగా శ్రీ రఘు విస్సంరాజు మరియు శ్రీ సూర్యనారాయణ సరిపల్లె గార్ల దర్శకత్వంలో నిర్వహించబడిన ఈ కార్యక్రమం ప్రేక్షకులకు ఆనందానుభూతులను మిగిల్చింది. శ్రీ వడ్దేరాజు శ్రీనివాస్ గారు రికార్డింగులకు ఎంతో కృషి చేసారు. శ్రీ వేణుగోపాల్ రాజుపాలెం గారు వ్యాఖ్యానం వ్రాసారు.
DSC_8159-1
pk7

తెలుగు వారి శ్రేయోభిలాషి, హిందూ సొసైటీ అఫ్ విక్టోరియా కు 2011 లో అధ్యక్ష పదవినలంకరించిన తొలి తెలుగు తేజం శ్రీ రాంప్రసాద్ వేముల గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసి గత ఏడాది భువన విజయం “శ్రీ కృష్ణ రాయబారము”, ఈ ఏడాది “శ్రీ పార్వతీ కళ్యాణం” రంగస్థల నాటకాలు ప్రదర్శించి ఎంతో ఘనతకెక్కి వచ్చే సంవత్సరం ఏ కార్యక్రమం తెనున్నారో వేచి చూడాలని వ్యాఖ్యానించారు.

గత 5 నెలలుగా రికార్డింగులు, రిహార్సల్స్ కోసం ఎంతో కృషి చేసిన భువన విజయ సభ్యులు శ్రీ రఘు విస్సంరాజు మరియు శ్రీ వడ్డిరాజు శ్రీనివాస్ గార్లకు అభినందనలు తెలియజేస్తూ శ్రీ రాంప్రసాద్ గారు జ్ఞాపికలు అందజేసారు.

చిరంజీవి ప్రియాంక మార్గాని వ్యాఖ్యాతగా కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి పాత్రధారులు ఒక ఎత్తైతే ముఖాలంకరణ చేసిన శ్రీమతి రమాశ్రీ ముడుంబ, శ్రీమతి లక్ష్మి పేరి, శ్రీమతి హరిప్రియ తాడికొండ మరియు శ్రీమతి మరియా బులుసు అద్భుతమైన తమ హస్తవాసితో నమ్మశక్యం కాకుండా పాత్రధారులను తీర్చిదిద్దారు.

తెలుగుమల్లి సంచాలకులు శ్రీమతి ప్రత్యూష కొంచాడ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని దుస్తుల సేకరణ, ముఖాలంకరణ, భూషణాది వేషసామగ్రి, రంగస్థల అలంకరణ మొదలగు విషయాలలో ఎంతో సహాయపడి శోభాయమానంగా తీర్చిదిద్దారు.

ఈ కార్యక్రమానికి ఆర్ధిక సహాయం అందించిన దోసా హట్, ఇంటిగ్రేటెడ్ అకౌంటెంట్స్, బిర్యానీ మహల్, అంబా బజార్ మరియు ఆస్ట్రేలియా లేసర్ అండ్ క్లినిక్స్ వారికీ కృతజ్ఞతాభినందనలు.

నిర్వాహకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నటులు, దాతలు, స్వచ్చంద సేవకులు, ప్రేక్షకులు మరియు ప్రత్యక్షంగా లేక పరోక్షంగా సహాయన్నందించిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకున్నారు.

Send a Comment

Your email address will not be published.