సంస్థలు - సంగతులు

imagebata

బాటా షూస్
భారతదేశంలో పరిచయం అక్కరలేని చెప్పుల సంస్థ, అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులున్న చెప్పుల సంస్థ ఇది. 1894లో చెకోస్లోవేకియాలో ప్రారంభించబడిన ఒక కుటుంబ వ్యాపార సంస్థ తోమాస్, అతని సోదరుడు ఆంతోనిస్, సొదరి అన్నా ఈ వ్యాపారాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం దీని ప్రధాన కార్యాలయం స్విట్జెర్లాండ్ లో ఉంది. తోమాస్ చెప్పుల తయారికి అవసరమైన తోలు కొనటానికి భారతదేశం వచ్చినప్పుడు చాలామంది కాళ్ళకు చెప్పులు లేకుండా తిరగటం చూసి ఈ దేశాన్ని తన వ్యాపారానికి అనువైన చోటుగా గుర్తించి దానిని వెంటనే ఆచరణలో పెట్టి విస్తరింపజేశాడు. అందరు బాటా భారతదేశానికే చెందినదని అనుకునేటట్లు చేశాడు.

ఇండియన్ మోటార్ సైకిల్స్
ఇది నిజంగా అమెరికన్ బ్రాండ్. అసలు ఈ సంస్థ పేరు “హెండీ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ “. కాని 1928లో దీని పేరు “ఇండియన్ మోటార్ సైకిల్ కంపెనీ” గా మార్చారు . మన దేశంలో 2014లో మొదటిసారిగా ఈ సంస్థ తన షో రూంను ప్ర్రారంభించింది.
హిందూస్తాన్ యూని లివర్ లిమిటెడ్

యూని లివర్ అనేది ఒక ఆంగ్లో – డచ్ కంపెనీ. 2015 మార్చి నాటికి హిందూస్తాన్ యూని లివర్ సంస్థలో 67 శాతం వాటాను యూని లివర్ కలిగి ఉంది. భారతదేశంలో ఎక్కువ మంది ప్రజలు వాడే గృహ సంబంధమైన సబ్బులు, పేస్టులు, బ్లేడ్లు మొదలైనవి ఈ బ్రాండ్ పేరుతోనే మార్కెట్లలో లభ్యమవుతుంటాయి.

కాల్గేట్
కాల్గేట్ – పామాలివ్ అనేది ఒక ఆమెరికన్ మల్టి నేషనల్ కంపెనీ. ఈ సంస్థ సోప్, డిటెర్జంట్ , ఓరల్ హైజీన్ ఉత్పత్తులు చేయడంతోపాటు మార్కెటింగ్ లో ప్రపంచ వ్యాప్తంగా అగ్రగామిగా దూసుకుపోతోంది.. మనకు పొద్దునే కాల్గేట్ టూత్ పేస్ట్ అవసరమేకదామరి.

టాట్ర ట్రక్కులు
భారతీయ సైన్యము వాడే ఈ ట్రక్కులను తయారుచేసే టాట్ర కంపెనీ చెకొస్లోవియాలోని కోప్రివిన్సియా నగరంలో ఉంది. దీనిని 1850లో స్థాపించారు. మన దేశంలో టాట్ర సంస్థ సహకారంతో భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ వారు మన సైన్యానికి అవసరమయిన ట్రక్కులను తయారుచేసి అందిస్తున్నారు

స్టార్ టి.వి
దీని పూర్తి పేరు “శాటిలైట్ టెలివిజన్ ఏషియన్ రీజియన్ “. అమెరికాకు చెందిన 21వ సెంచరీ ఫాక్స్ అనే మల్టీ నేషనల్ మాస్ మీడియా కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడిచే ఏషియన్ టి .వి సర్వీసు . దీనిలో మూడు విభాగాలు ఉన్నాయి. మొదటిది,”స్టార్ ఇండియన్”, రెండవది”స్టార్ గ్రేటర్ చైనా ” మూడవది ,”ఫాక్స్ఇంటర్ నేషనల్ చానల్స్ ఏషియా “.

నెస్లే
భారత దేశంలో బాగా ప్రాచుర్యం సంపాదించిన “మ్యాగి , కిట్ క్యాట్ “వంటి ఉత్పతుల బ్రాండ్లు మన దేశానివే అన్న భావన మనలో చాలా మందికి ఉంది. నిజానికి ఇది స్విట్జర్ల్యాండు కు చెందిన” స్విస్ ట్రాన్స్ నేషనల్ ఫుడ్ అండ్ బ్రెవెరేజ్” కంపెనీ ఆధ్వర్యంలోనిదే.

బోస్ స్పీకర్స్
ఫక్తు బెంగాలి పేరులా అనిపించే ఈ కంపెనీ మెసాచ్యుట్స్ లోని ఫ్రామింగ్ హం నగరంలో గల ఒక అమెరికన్ కార్పొరేషన్. ఇది ఖరీదైన ఆడియో ఎక్విప్ మెంట్ తయారీలో బాగా పేరున్న కంపెని. ఈ కంపెనీని 1964లో అమర్ బోస్ అనే అమెరికాలో స్థిరపడిన భారతీయుడు స్థాపించాడు.

టైడ్ డిటెర్జెంట్
1946లో స్థాపించబడిన ప్రొక్టర్ అండ్ గ్యాంబుల్ తన ఉత్పత్తులను అమెరికా మార్కెట్లలో ప్రవేశపెట్టి క్రమంగా అనతికాలంలోనే ప్రపంచ వ్యాప్తి చెందింది . ఈ కంపెనీ ఉత్పత్తుల లోనిదే టైడ్ డిటెర్జెంట్ పౌడర్

వేదాంత రిసోర్సెస్
ఇది మెటల్స్ అండ్ మైనింగ్ వ్యాపారంలో అంతర్జాతీయంగా పేరున్నసంస్థ. ఒడిస్సా లో మైనింగ్ వ్యాపారం పేరు చెప్పి చాలా మేరకు అటవీ భూములను ఆక్రమించుకొన్న సంస్థ. దీని ప్రధాన కార్యాలయం లండన్ లో ఉంది. దీనిలోని భాగస్వాములు ఎక్కువ మంది బ్రిటిష్ జాతీయులే.

గుడాంగ్ గరం సిగరెట్లు
ఈ సుగంధ పూరితమైన సిగరెట్లు తయారీ కంపెనీ ఇండోనేషియా దేశానికి చెందినది. దీనిని 1958లో టియోన్ ఇంగ్ హ్వై స్థాపించాడు. తరువాత ఆతను అతని పేరును సూర్య వొనొవిడ్జోజోగా మార్చుకొన్నాడు ఇండోనేషియన్ భాషలో గుడాంగ్ గరం అంటే అర్ధం సాల్ట్ వేర్ హౌస్ (ఉప్పు గిడ్డంగి).
————————–
అంబడిపూడి శ్యాంసుందర్ రావు

Send a Comment

Your email address will not be published.