ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, మానవతావాది, దేశ విదేశాల్లో అపార శిష్య గణం కలిగిన సద్గురు కందుకూరి శివానంద మూర్తి(87) బుధవారం తెల్లవారు జామున వరంగల్ లో పరమపదించారు. వృద్ధాప్యానికి తోడు, ఎండా తీవ్రత వాళ్ళ ఆయన కొద్ది కాలంగా అస్వస్థులుగా ఉన్నారు. ఆయనను ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్లో పలకరించారు. ఆయన అస్వస్థత వార్త తెలిసినప్పటి నుంచీ వరంగల్ నగరంలోనే బస చేసిన వందలాది మంది శిష్యులు ఆయన మరణ వార్త విని కన్నీరు మున్నీరుగా విలపించారు. తెలంగాణా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు వరంగల లోని ఆయన ఆశ్రమం గురుధాం కు చేరుకున్నారు.
శివానంద మూర్తి ఏడాది క్రితమే తన సమాధిని గురుదాం లో నిర్మించుకున్నారు. అక్కడే ఆయన దేహాన్ని సమాధి చేశారు.