'సన్ రైజ్' ఆంధ్ర ప్రదేశ్

విశాఖపట్నంలో ఆదివారం నుంచి మూడు రోజులపాటు పరిశ్రమల పండుగ జరగబోతోంది.

నవ్యాంధ్ర ప్రదేశ్ తనను తాను ఆవిష్కరించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాల్లో కీలక ఘట్టంగా అధికారులు దీన్ని అభివర్ణిస్తున్నారు. ‘సన్ రైజ్’ ఆంధ్ర ప్రదేశ్ అని ఈ పారిశ్రామిక పండుగకు పేరు పెట్టారు.

రాష్ట్రాన్ని పెట్టుబడులకు స్వర్గధామంగా మార్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పండుగను తలపెట్టారు. ఈ పారిశ్రామిక సదస్సుకు స్వదేశం నుంచే కాక, 40 దేశాల నుంచి కూడా 300 మందికి పైగా పారిశ్రామిక దిగ్గజాలు హాజరవుతున్నారు. ఈ సదస్సు ద్వారా వందకు పైగా పారిశ్రామిక ఒప్పందాలు కుదర్చుకోవాలని, 4.5 లక్షల కోట్ల పెట్టుబడులను సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సదస్సుకు వంద దేశాల నుంచి రాయబారులు కూడా హాజరవుతున్నారని తెలిసింది.

Send a Comment

Your email address will not be published.