సమైఖ్య సెగకి తలొగ్గిన సీమాంధ్ర నేతలు

పార్టీ కంటే మాకు ప్రజలే ముఖ్యం … అధికార కాంక్ష లేదు

తెలంగాణ కాబినెట్ నోట్ రెడీ అంటే … రాజీనామాలే అంటున్నారు సీమాంధ్ర నేతలు.

రాష్ట్ర విభజనకి అనుకూలంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకుని తెలంగాణ రాష్ట్రము ఇస్తామని ప్రకటించి సుమారు 45 రోజులు దాటినా తర్వాత సీమాంధ్ర మంత్రులు , ఎం.పీలు కలిసి చేసిన ప్రకటన ఇది.

మంత్రులు , ఎం.పీలు చేసిన ఈ ప్రకటన వారు స్వయంగా చేసింది కాదు. రోజురోజుకి ఉదృతం అవుతున్న సీమాంధ్ర ఉద్యమందే అని ఉద్యమకారులు భావిస్తున్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలని తీర్చడానికి యు.పీ.ఎ సారధి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రము ఇస్తున్నట్లు వర్కింగ్ కమిటీతో జూలై30వ తేది రాత్రి దిగ్విజయ్ సింగ్ తో ప్రకటన చేయించారు. హైదరాబాద్ తో కూడిన తెలంగాణ రాష్ట్రముని ఇస్తున్నట్టు దిగ్విజయ్ ప్రకటించాడు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకి ఉమ్మడి రాజధానిగా పది సంవత్సరాలు ఉంటుందని ఆయన ప్రకటించాడు ప్రధాన ప్రతిపక్షం బి.జె.పీ తెలంగాణ కు అనుకూలం కాబట్టి తెలంగాణ బిల్లు పార్లమెంట్లో సాధారణ మెజారిటీ తో పాస్ అవుతుందనిచెప్పాడు. సీమాంధ్ర ప్రాంతం గురించి ఒక్క మాట మాట్లాడలేదు.

దిగ్విజయ్ సింగ్ ప్రకటనతో ప్రారంభమైన సీమాంధ్ర ఉద్యమం నలభై ఐదు రోజులు దాటినా ఇంకా రోజురోజుకి ఉదృతం అవుతుంది. రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు,సామాన్య ప్రజలు ఉద్యమంలో పాల్గొంటున్నారు ప్రతి పట్టణం లోను మానవ హారాలు, లక్షఘలఘోష నిరాహార దీక్ష లతో మారు మొగుతున్నై బస్సులు లేవు, బడులు లేవు, కరెంటు లేదు. ప్రబుత్వ ఉద్యోగులు నిరవధికంగాసెలవు లో ఉన్నారు,అత్యవసర సర్వీసులు తప్పమరేవీ పని చేయడం లేదు.

సమైఖ్య గళం వినిపించడానికి ఉద్యోగులు ఢిల్లీ వెళ్లారు దిగ్విజయ్ సింగ్ ఇంటిని ముట్టడించారు. సీమాంధ్ర మంత్రులను, పార్లమెంట్ సభ్యులని రాజీనామాలు
చేయాలనీ డిమాండ్ చేసారు. మొదట్లో మంత్రులు రాజీనామకి అంగీకరించలేదు.సోనియా తో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దుతామని చెప్పారు. సీమాంధ్ర సమస్యలు వినడానికి ఆఖ్హరకు సోనియా అంటోనీ కమిటి నియమించింది. అశోక్ బాబు నేతృత్వం లో హైదరాబాద్ లో జరిగిన సభ విజయంకావడంతో కేంద్రం తోపాటు సీమాంధ్ర మంత్రులు

పునరాలోచన్లో పడ్డారు. రాజీనామాలతో సమస్య పరిష్కారం కాదన్నవారు కూడా రాజీనామాకి వెనకడుగు వేయమని చెబుతున్నారు. ఇదంతా సమైఖ్య ఉద్యమ ఫలితమే అని సమైఖ్యవాదులు అభిప్రాయపడుతున్నారు.

Send a Comment

Your email address will not be published.