సహాయమే శ్రీరామ రక్ష

<a href=”http://www.telugumalli.com/wp-content/uploads/2015/10/birds.jpg”><img class=”alignleft size-full wp-image-14275″ title=”birds” src=”http://www.telugumalli.com/wp-content/uploads/2015/10/birds.jpg” alt=”” width=”215″ height=”106″ /></a>అది శీతాకాలం. దట్టమైన మంచు. ఒక్క కుక్కా వీధిలోకి రాలేదు. ఒక్క పక్షీ కనిపించడం లేదు. కనీసం వాటి గొంతు కూడా వినిపించడం లేదు. పిచ్చుకలు ఎక్కడ వీలుంటే అక్కడ తలదాచుకుంటున్నాయి. పావురాలు సురక్షితమైన చోటు కోసం వెతుక్కుని దాగిపోతున్నాయి. చాలా పావురాలు అప్పటికే చలికి తట్టుకోలేక చనిపోయాయి.

కొన్ని పావురాలు ఓ ఇంటి పైకప్పు కింద చోటు చేసుకుని ఒదిగిపోయాయి. .
అక్కడికి కొన్ని పిచ్చుకలు వచ్చి పావురాలతో “మీ శరీరం మా కన్నా పెద్దది. మీ రెక్కల కింద మాకు చోటిస్తే వాటికింద మేము ఈ రాత్రికి ఉండిపోతాం. మీ శరీర ఉష్ణోగ్రతతో మా ప్రాణాలు దక్కించుకుంటాం” అని అడిగాయి దీనంగా.

ఇంతలో ఒక పావురం “ఇప్పటికే మనలో చాలా చనిపోయాయి. ఇపుడు ఆ పిచ్చుకులకు చోటిచ్చామో మన పని గోవిందా….వాటిని ఒక్క నిముషం ఉండనిచ్చినా చాలు వాటి చలి మన ప్రాణాల్ని బలిగొంటాయి” అని చెప్పింది. ఆ మాటలకు కొన్ని పావురాలు అవునని తలూపి పిచ్చుకలకు చోటివ్వడానికి ససేమిరా అన్నాయి.

అయితే ఒక పావురానికి పిచ్చుకల మీద జాలేసింది.

“ఈ రోజు రాత్రి ఎలాగూ మనం చనిపోతాం … ప్రాణంతో ఉన్నంత వరకు మన జీవితాన్ని ఎవరికి అవసరమో వారికి ఉపయోగపడేలా తోడ్పడటం మంచిది కదా” అనుకొని ఆ పావురం తన రెక్కల కింద ఓ పిచ్చుకకు ఆశ్రయమిచ్చింది. అది చూసి మరికొన్ని పావురాలు కూడా కొన్ని పిచ్చుకలకు చోటిచ్చాయి.

రాత్రి సాగే కొద్దీ మంచు పెరుగుతోంది. దానితోపాటు చలి కూడా పెరుగుతోంది.

తెల్లారింది.

ఆ ఇంటి చిన్నారి కిటికీ తలుపు తీసి బయటకు చూసింది.

అప్పుడు పైకప్పు నుంచి ఓ పావురం నేల మీద పడటం చూసింది. నాన్నను పిలిచి పావురం నెల మీద పడి ఉండటాన్ని చూపించింది. ఆయన దాని దగ్గరకు వెళ్లి చూసాడు. అది చచ్చిపోయింది. ఆయన దృష్టి పైకప్పు మీద పడింది. పైకప్పు కింద కొన్ని పావురాలు ఉండటం చూసాడు. వాటిని తీసుకుని ఆయన వెచ్చగా ఉన్న ఒక చోట పెట్టాడు. కాస్సేపు తర్వాత కొన్ని పావురాలు రెక్కలు కదిల్చాయి. గొంతు విప్పాయి. వాటి రెక్కల కింద నుంచి కొన్ని పిచ్చుకలు ఎగరటం చూసాడు.
కొన్ని పావురాలు అటూ ఇటూ కదలకు చనిపోయి ఉండటం చూసాడు. చిన్నారి వాటి రెక్కలను కదల్చి చూసింది. కానీ వాటిలో చలనం లేదు. అవి చనిపోయాయి. వాటి రెక్కల కింద పిచ్చుకలు కూడా లేవు.

చిన్నారి తండ్రికి విషయం అర్ధమైంది.

” పాపాయి…చూసేవా…పిచ్చుకలకు ఆశ్రయమిచ్చిన పావురాలు చావు నుంచి తప్పించుకున్నాయి. ఆశ్రయమివ్వని పావురాలు చనిపోయాయి. ఆశ్రయమిచ్చిన పావురాల శరీర వెచ్చదనాన్ని పొంది పిచ్చుకలు బతికిపోయాయి. అలాగే పిచ్చుకల శరీర వెచ్చదనం పావురాల మనుగడకు తోడ్పడింది. మనం ఎప్పుడూ కష్టాల్లో ఉన వారికి సహాయపడాలి. ఆ సహాయం మనకు శ్రీరామ రక్ష అవుతుంది….” అన్నాడు.

ఇది ఓ విదేశ కథ. అయితేనేం సందేశాత్మక కథను ఒక్కసారి పరిశీలించడం తప్పు కాదుగా.

ఏమంటారు..?

– యామిజాల జగదీశ్

Send a Comment

Your email address will not be published.