సానియాకు ఖేల్ రత్న

హైదరాబాద్ నగరానికి చెందిన ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాకు రాజీవ్ గాంధి ఖేల్ రత్న పురస్కారాన్ని ఇవ్వాలని కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ సిఫారసు చేసింది. ఈ పురస్కారం దేశంలో అత్యున్నత క్రీడా పురస్కారంగా గుర్తింపు పొందింది. ఇటీవల వింబుల్డన్ మహిళల డబుల్సులో టైటిల్ నెగ్గి చరిత్ర  సృష్టించిన సానియా ఈ పురస్కారం కోసం వ్యక్తిగతంగా దరఖాస్తు చేయలేదు. కానీ 28 ఏళ్ల సానియా మీర్జాకు ఈ పురస్కారం ఇవ్వాలని కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ స్వయంగా నిర్ణయం తీసుకుంది. సానియాను 2004లో అర్జున అవార్డు, 2006లో పద్మశ్రీ పురస్కారం వరించాయి. కాగా, వివిధ రంగాలకు చెందిన తొమ్మిది మంది క్రీడాకారులు రాజీవ్ గాంధి ఖేల్ రత్న పురస్కారం కోసం దరఖాస్తు చేసుకున్నట్టు తెలిసింది.

Send a Comment

Your email address will not be published.