సాయినాధుని సన్నిధానం

సదా సత్వ రూపం ప్రసన్నాత్మ భావం
నమామీశ్వరం సద్గురుం సాయినాథం

గత సంవత్సరం “మెల్బోర్న్ లో శ్రీ ఓం సాయి ప్రస్థానం” అన్న శీర్షికన తెలుగుమల్లి లో ఒక వ్యాసాన్ని ప్రచిరించడం జరిగింది.  ఈ వ్యాసంలో ఓం సాయి సంస్థ 2010 నుండి 2012 వరకు వారి అంచలంచెల ప్రస్థానం వివరించ బడింది.  2013 ఆగష్టు 9 వ తేదీన మొర్డియలోక్  లో గుడిని శ్రీ సాయి బాబా విగ్రహ స్థాపనతో ప్రారంభించారు.

ప్రస్తుతం ప్రతీ రోజు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల  వరకు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8:30 గంటల వరకు పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయని అధ్యక్షులు శ్రీ అనిల్ కొలనుకొండ గారు తెలిపారు.  ప్రతీ గురువారం 7:15 గంటలకు విష్ణు సహస్ర పారాయణం మరియు 7:45 కు పల్లకి సేవ నిర్వహిస్తారు.  ప్రతీ నెల పూర్ణిమ రోజు శ్రీ సత్యనారాయణ వ్రతం నిర్వహిస్తున్నారు.   రెండు పూటలా ఇద్దరు వేర్వేరు పూజారులు ఉంటూ కార్యక్రమాలని చక్కగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
శ్రీ రామ నవమి ఉత్సవాలు

ఈ నెల మొదటి వారంలో శ్రీరామ నవమి సందర్భంగా ఉత్సవాలు భారీ ఎత్తున జరిపినట్లు షుమారు 275 మంది భక్తులు వచ్చినట్లు శ్రీ అనిల్ గారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఈ దిగువున పేర్కొన్న ప్రముఖులు హాజరయ్యారు:

Mayor Cr Paul Peulich,Kingston City Council
Mr M C Bhagat, Vice Counselor General of India, Melbourne
Cr Geoff Gledhill, Councillor Kingston City Council

ఉడిపికి చెందిన శ్రీ శ్రీ శ్రీ సుగునేంద్ర తీర్థ స్వామీజీ ఈ నెల శ్రీరామ కళ్యాణోత్సవంలో పాల్గొని బాబా గుడిలో ప్రత్యెక పూజలు చేసారు.
గురువారం నుండి అదివారం వరకు భక్తులు తండోప తండాలుగా వస్తూ ఉంటారని మన తెలుగు వాళ్లతో  భారతీయ సంతతికి చెందిన పలువురు భక్తులు ఎక్కువ మంది వస్తుంటారని ఉపాధ్యక్షులు శ్రీ శసీంద్ర  అమరానేని గారు వివరించారు.  ఈ గుడిలో ప్రస్తుతం సత్యనారాయణ వ్రతం, వెంకటేశ్వర కళ్యాణం, శ్రీరామ కల్యాణోత్సవం ఇలా అన్ని రకాల పూజలు చేసుకోవడానికి తగు సదుపాయాలు కల్పించామని, భోజన వసతి సదుపాయాలు అతి తక్కువ ధరకు అందించగలమని చెప్పారు.  భక్తులు వారి యొక్క పుణ్య కార్యాలు, పూజా కార్యక్రమాలు ఈ గుడిలో చేసుకున్నందువలన గుడికి ఆర్ధిక సహాయన్నందించిన వారౌతారనీ ఇందు మూలంగా గుడి కట్టడం వేగవంతం కాగలదని ఆశిస్తున్నామని శ్రీ శసీంద్ర గారు భక్తులకు విజ్ఞప్తి చేసారు.  ఈ మధ్యనే భద్రాచలం నుండి శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు మరియు హనుమంతుని ఉత్సవ విగ్రహాలు తీసుకొని రావడం జరిగింది.  ఇంకో రెండు వారాల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవ విగ్రహాలు కూడా తీసుకు రానున్నట్లు  శ్రీ శసీంద్ర అమరానేని  గారు చెప్పారు.
ఇంట్లో ఏవైనా పూజా కార్యక్రమాలు తలపెడితే వాటికీ కూడా సామగ్రితో పటు పూజారులు వచ్చే ఏర్పాట్లు చేయనున్నట్లు శ్రీ  శసీంద్ర  గారు చెప్పారు.

పూజా కార్యక్రమాలతో పాటుగా గుడిలో పెళ్ళిళ్ళు చేసుకోవడానికి తగు సదుపాయాలు కల్పించారు.  ఈ మధ్యనే రెండు పెళ్ళిళ్ళు జరిగాయనీ మరెంతోమంది తమ పెళ్ళిళ్ళు సాయినాధుని సన్నిధానంలో జరుపుకోవడానికి ఉవ్విల్లూరుతున్నారని ముఖ్యంగా యువత ఎక్కువగా ఫోను ద్వారా సంప్రదిస్తున్నట్లు శ్రీ అనిల్ గారు చెప్పారు.  పెళ్లిళ్లకు కావలసిన మండపాలు, భోజన సదుపాయాలు ఈ గుడిలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేసారు.
ప్రస్తుతం చుట్టూ ప్రక్కల ప్రాంతాల్లో గుడికి అనువైన  స్థల సేకరణకు ప్రయత్నాలు జరుగుతున్నాయని మరో 6 నెలలో ఈ కార్యక్రమం పూర్తీ చేసుకొని గుడి కట్టడానికి తగు నమూనాలు, అంచనాలు వేయడానికి పూనుకో నున్నట్లు ఓంసాయి కార్యదర్శి శ్రీ రాంపాల్ ముత్యాల గారు తెలిపారు.  అనుకున్న రీతిలో పనులు జరిగితే మెల్బోర్న్ లోని భారతీయుల కల ఇంకో రెండు సంవత్సరాల్లో సాకారం కాగలదని ఇందుకు భక్తులందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.  గుడి నిర్మాణం కేవలం మత సంబంధ పరంగా కాకుండా విద్య, భారతీయ సంస్కృతీ పరిశోధనా కేంద్రంగా కూడా రూపు దిద్దాలని అనుకుంటున్నట్లు శ్రీ రాంపాల్ గారు వివరించారు.

Send a Comment

Your email address will not be published.