సాయి శివ విష్ణు మందిరంలో వినాయక చతుర్ధి

హాపర్స్ క్రాసింగ్ లోని సాయి శివ విష్ణు మందిరంలో వినాయక చతుర్ధి సందర్భంగా భక్తి శ్రద్ధలతో ఈ నెల 9 నుండి 15 వరకు పూజా కార్యక్రమాలు జరిగాయి. వినాయక నిమజ్జనం 15 వ తేదీన జరిగింది. దేవ దేవునికి నైవేద్యం మరియు భక్తులకు ప్రసాదం సుమన్ పర్వతి, శశిధర్ రెడ్డి బీరవెల్లి, సతీష్ చౌదరి నల్లని, మధు పైల్ల, శ్రీనివాస్ పెద్ది, అశోక్ బెల్లల మరియు ఇంకొంత మంది స్నేహితులు కలిసి ఏర్పాట్లు చేసారు.  వీరందరూ గత రెండేళ్లుగా ఈ ఉత్సవానికి చేయూతనిస్తూ ఎంతో సేవ చేస్తున్నారు.

ఈ సందర్భంగా మెల్బోర్న్ తెలంగాణా ఫోరం అధ్యక్షులు శ్రీ నూకల వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడుతూ ఇటువంటి కార్య క్రమాలు నిర్వహించడం ద్వారా మన భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు నిలబెట్టడమే కాకుండా తరువాత తరం వారికీ అందించిన వారమౌతమనీ మరియు స్థానికులకు మన కొన్ని వేల చరిత్ర గలిగిన మన సంప్రదాయం లోని గొప్పదనాన్ని తెలియపరిచడానికి ఒక గొప్ప అవకాశం అనీ పేర్కొన్నారు.

Send a Comment

Your email address will not be published.