సాహిత్య అకాడమీ పురస్కారాలు

Sahitya Akademi2016కేంద్ర సాహిత్య అకాడమీ ప్రకటించిన అవార్డుల జాబితాలో ఈ సారి ఇద్దరు తెలుగువారున్నారు. వారిలో ఒకరు పాపినేని శివశంకర్. మరొకరు నాగళ్ల గురుప్రసాద రావు. ఈ అవార్డు కింద వీరికి వచ్చే ఏడాది ఫిబ్రవరి 22 వ తేదీన తామ్రపత్రంతోపాటు లక్ష రూపాయల నగదును అందజేస్తారు.  కవిగా రచయితగా విమర్శకుడిగా తెలుగుసాహిత్య రంగంలో ప్రముఖ స్థానం సంపాదించిన పాపనేని శివశంకర్ 2013లో రాసిన “రజనీగంధ” కవిత్వ సంపుటికి ఇప్పుడు ఈ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాతృభాషలో విరివిగా కవిత్వం వచ్చినప్పుడే ప్రజల్లో సామాజిక సమస్యపై అవగాహన పెరుగుతుందని అభిప్రాయ పడ్డారు.

1953 నవంబర్ ఆరో తేదీన ఓ సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించిన శివశంకర్ కలం నుంచి జాలువారిన మొదటి కవితా సంపుటి స్తబ్ధత – చలనం. ఇది 1984 లో వచ్చింది. ఆ తర్వాత ఆయన ఎన్నో కవితలతోపాటు కథలు కూడా రాసారు.

అలాగే, సంప్రదాయ, మధ్య యుగ సాహిత్యంలో విశేష కృషి చేసినందుకు గాను నాగళ్ల గురుప్రసాద రావుకి కూడా ఈసారి అవార్డు దక్కింది. తనకు లభించిన భాషా సమ్మాన్ అవార్డుపట్ల గురు ప్రసాద్ రావు సంతోషం వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాతృభాషపై ప్రతి ఒక్కరూ మమకారం పెంచుకోవాలన్నారు.

Send a Comment

Your email address will not be published.