సింగపూర్ లో శిక్షణ

పాలన, అభివృద్ధి రంగాలలో తెలంగాణా రాష్ట్ర సమితి నాయకులందరికీ సింగపూర్ లో శిక్షణ ఇప్పించాలని ఆ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఇటీవలే వారం రోజుల పాటు సింగపూర్, మలేషియా దేశాలలో పర్యటించి వచ్చిన చంద్రశేఖర్ రావుకు అక్కడి పాలన తీరు, అభివృద్ధి బాగా నచ్చాయి. మన దేశం సింగపూర్ నుంచి నేర్చుకోవాల్సింది ఎంతయినా ఉందని ఆయన అన్నారు. తెలంగాణా మంత్రులు, శాసన సభ్యులు సింగపూర్ అభివృద్ధి సూచికలను ఒంటబట్టించుకోవాలని, వాటిని ఇక్కడ అమలు చేయాలని ఆయన భావిస్తున్నారు. మంత్రులు, శాసన సభ్యులు బృందాలుగా సింగపూర్ వెళ్లి అక్కడ శిక్షణ పొంది రావడానికి కార్యక్రమం రూపొందిస్తున్నామని ఆయన తెలిపారు. ఇందుకు సుమారు 60 కోట్ల రూపాయల ఖర్చు కాగలవని అంచనా వేస్తున్నారు.

Send a Comment

Your email address will not be published.