సూర్య అంటే ఇష్టం

నటి సామంత పుట్టి పెరిగింది చెన్నైలో అయినా ఆమెకు అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించింది మాత్రం టాలీవుడ్ పరిశ్రమే అనడంలో సందేహం లేదు.

అలాగే ఆమె కూడా తన అందంతోను, నటనతోను ప్రేక్షకులను ఆకట్టుకుంది కూడా. అందుకే ఆమె నటిస్తే చాలు ఆ సినిమా విజయం సాధించడం తద్యమనే అభిప్రాయం అటు నిర్మాతల్లోను, ఇటు దర్శకుల్లోను లేకపోలేదు.

ఆమె ఈ రోజు ఓ బిజీ స్టారే. ఇందులో అనుమానం లేదు.

ఈమధ్య ఆ అందాల సుందరి తన మనసులోని మాటల్ని ఇలా చెప్పుకొచ్చింది….

“చదుకునే రోజుల నుంచే నాకు సూర్య అంటే ఎంతో ఇష్టం. నేను ఆయన అభిమానిని. ఆయన సినిమా విడుదల అవుతోందంటే చాలు ఆ రోజు క్లాస్ ఎగ్గొట్టి ఆ సినిమా చూడటానికి వెళ్ళే దానిని. గజని సినిమాలో నటించిన సూర్య ఒక రోజు ఆ సినిమా ప్రచారంలో భాగంగా మా కాలేజీకి వచ్చారు. అప్పుడు నేను ఉండబట్టలేక అరుస్తూ ఒక దశలో ఐ లవ్ యు అని చెప్పాను. ఆ మాట ఆడిటోరియం అంతా వినిపించింది. ఇంతలో కొందరు మిత్రులు మరి ఆయనతో కలిసి నటించే అవకాసం వస్తే నటిస్తావా అని నన్ను అడిగారు. కానీ అప్పుడు నేను వారి మాటలు పెద్దగా పట్టించుకోలేదు. వారి మాటలకు జవాబివ్వలేదు….” అని చెప్పిన సమంతా ఇప్పుడు సూర్య తో కలిసి అంజాన్ అనే చిత్రంలో నటించింది. ఆ సినిమానే ఇటీవల సికందర్ అనే టైటిల్ తో తెలుగులో విడుదల అయ్యింది కూడా.

Send a Comment

Your email address will not be published.