సౌర శక్తికి గిరాకీ

తెలుగు రాష్ట్రాల్లో సౌర శక్తీ వినియోగం ఊపందుకుంటోంది. ఇళ్ళలో సౌర శక్తీ వినియోగానికి అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా రాయితీలు ఇస్తుండడంతో ప్రతి ఒక్కరూ ఇళ్ళ మీద సోలార్ ప్లాంట్స్ ఏర్పాటు చేసుకోవడానికి ముందుకు వస్తున్నారు. చాలా ఏళ్ల క్రితమే నరేంద్ర మోడీ గుజరాత్ రాష్ట్రంలో సౌర శక్తీ వినియోగంపై అవగాహన పెంచి, ఇందులో సఫలమయ్యారు. ఇప్పుడు ఆ పద్ధతినే దేశమంతా అమలు చేస్తున్నారు. జల, తాప విద్యుత్తుల ఉత్పత్తి చాలినంత లభ్యం కాకపోవడంతో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు సోలార్ విద్యుత్తును ప్రోత్సహిస్తోంది. ఒక్క ఇళ్ళ పైనే కాకుండా ప్రభుత్వ కార్యాలయాలపైన కూడా సోలార్ ప్లాంట్స్ ఏర్పాటు చేయడానికి కేంద్ర దాదాపు 50 శాతం సబ్సిడీ కల్పిస్తోంది. ఇళ్ళలో ఏర్పాటు చేసుకునే ప్లాంట్స్ ద్వారా మూడు కిలో వాట్ల మేరకు విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వాలు తెలిపాయి. ఈ సౌర శక్తీ వల్ల ఇళ్ళకు నిరంతర విద్యుత్ సరఫరా జరగడమే కాకుడా, పర్యావరణ హితంగా కూడా ఉంటుందనీ, విద్యుత్ వినియోగ బిల్లుల ఖర్చు కూడా 70 శాతం వరకూ తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. సుమారు 25 శాతం ప్రజలు ఇప్పటికే సౌర శక్తిని వినియోగిన్చుకున్తున్నారానీ, ఇది రెండేళ్లలో 80 శాతానికి పెరిగే అవకాశం ఉందనీ అధికారులు చెప్పారు.

Send a Comment

Your email address will not be published.