స్మితపై మరో చిత్రం

సుమారు 18 ఏళ్ల క్రితం ఆత్మహత్య చేసుకుని మరణించిన ప్రసిద్ధ తెలుగు తార సిల్క్ స్మితపై మరో చిత్రం రూపొందబోతోంది. ఈసారి మరాఠీ భాషలో ఆమెపై చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఆమె 200కు పైగా చిత్రాల్లో నటించినప్పటికీ ఆమె జీవితంపై ఈ రెండు భాషల్లో ఇంతవరకూ ఒక్క చిత్రం కూడా రూపొందలేదు. ఇంతకు ముందు ఆమె జీవితాన్ని ఇతివృత్తంగా చేసుకుని హిందీలో ‘డర్టీ పిక్చర్’, మలయాళ భాషలో ‘క్లైమాక్ష్’, కన్నడంలో ‘డర్టీ పిక్చర్:సిల్క్ సకత్ మగ్గ’ పేర్లతో సినిమాలు విడుదలయ్యాయి. ఈ సినిమాల మాదిరిగా సిల్క్ స్మిత జీవితాన్ని మార్చి రూపొందించకుండా, ఆమె కథను యథాతథంగా నిర్మించాలని మరాఠీ నిర్మాతలు భావిస్తున్నారు. జీవితంలో ఆమె ఎదుర్కొన్న కష్టనష్టాలు, కడగండ్లతో పాటు, సినిమా పరిశ్రమలోని చీకటి కోణాలను కూడా బయటపెట్టాలని వారు యోచిస్తున్నారు. ఏలూరుకు చెందిన స్మిత 20 ఏళ్ల పాటు తన సెక్సీ నటనతో ఉర్రూత లూగించింది. వ్యక్తిగత వైవాహిక సమస్యల కారణంగా ఆమె 1996 సెప్టెంబర్ 23న చెన్నైలో ఆత్మహత్య చేసుకుంది. ఇంతకూ ఈ మరాఠీ చిత్రానికి ఇంకా పేరు పెట్టలేదు. స్మితగా ఎవరు నటిస్తున్నారన్నది కూడా సస్పెన్స్.

Send a Comment

Your email address will not be published.