స్విట్జర్లాండ్ లో చంద్రబాబు

స్విట్జర్లాండ్ లోని దావోస్ నగరంలో జరిగే ప్రపంచ ఆర్ధిక సదస్సులో పాల్గొనడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు బయలుదేరి వెళ్ళారు. ప్రపంచ దేశాల అధినేతలు, పారిశ్రామిక, వాణిజ్య దిగ్గజాలు పాల్గొనే ఈ సదస్సు 20 నుంచి మూడు రోజులపాటు కొనసాగుతుంది. ఈ 46వ ఆర్ధిక సదస్సులో బ్రాండ్ ఎపీని ఆవిష్కరించడానికి చంద్రబాబు ఒక ప్రతినిధి వర్గంతో అక్కడికి వెళ్ళారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘సన్ రైజ్’ ఆంధ్ర ప్రదేశ్ కు పెట్టుబడులు ఆకర్షించడమే ఆయన ధ్యేయం. వాస్తవానికి ఈ సదస్సులో రాష్ట్ర స్థాయి నేతలు పాల్గొనడానికి అవకాశం లేదు. అయితే ఈ సదస్సులో ప్రత్యేక అతిధిగా పాల్గొనవలసినదిగా చంద్రబాబుకు సదస్సు నిర్వాహకులు ఆహ్వానం పంపడంతో ఆయన అక్కడికి వెళ్ళడం జరిగింది. ఇది ఓ రాష్ట్ర ముఖ్యమంత్రికి అరుదయిన గౌరవం. ఈ పర్యటన సందర్భంగా చంద్రబాబు ప్రపంచస్థాయి పారిశ్రామిక దిగ్గజాలను కలుసుకుంటారు. వివిధ అంతర్జాతీయ సంస్థల్ల ప్రతినిధులతో అక్కడి హోటల్స్ లో సమావేశం అవుతారు.

Send a Comment

Your email address will not be published.