హుసేన్ సాగర్ ప్రక్షాళన

నగరం నడిబోడ్డులో ఉన్న హుసేన్ సాగర్ చెరువుకు ఒకప్పటి వైభవం తీసుకు రావాలని కీ సి ఆర్ నాయకత్వంలోని తెలంగాణా ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది.

ఇందులో భాగంగా మొదట ఈ చెరువును ప్రక్షాళన చేయడానికి ప్రభుత్వం నడుం బిగించింది. ఇందుకు మొదటి విడతగా వంద కోట్ల రూపాయలు కేటాయించింది. ఈ చెరువు నుంచి కలుషిత జలాలను తొలగించి మంచి నీటితో నింపడానికి అధికారులు పథకాన్ని సిద్ధం చేస్తున్నారు. ఈ చెరువుకు వచ్చి చేరే పారిశ్రామిక వ్యర్థాలను, ఇళ్ళ నుంచి వచ్చే మురుగునీటిని అరికట్టడానికి ఇప్పటికే చర్యలు ప్రారంభం అయ్యాయి. వచ్చే వేసవిలో ఈ చెరువు ఎందిపోవడానికి అవకాశం కల్పిస్తారు. కొద్ది నీటిని పైపులగుండా ఇతర ప్రాంతాలకు మళ్ళిస్తారు.

కుకట్పల్లి, బంజారా, బల్కాపూర్, మారియట్, పికెట్ నాళాల నుంచి వచ్చే నీటిని పైపుల ద్వారా ఇతర ప్రాంతాలకు మళ్ళిస్తారు. వచ్చే రెండేళ్లలో హుసేన్ సాగర్ చెరువును పూర్తిగా ప్రక్షాళన చేసి నగర తాగు నీటి అవసరాలకు అనువుగా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ చెరువును వ్యవసాయ అవసరాల కోసం 1562లొ నిర్మించారు. 1884 నుంచి 1930 వరకూ తాగునీటి కోసం వినియోగించారు.
ఆ తరువాతి కాలంలో సాగర్ కలుషిత మయిపోయింది.

Send a Comment

Your email address will not be published.