హైదరాబాద్ కి ఇవాంకా ట్రంప్

Ivanka Trumpహైదరాబాద్ నగరంలో నవంబర్ 28 నుంచి మూడు రోజులపాటు జరిగే గ్లోబల్ ఎంట్రప్రెన్యుర్షిప్ సమ్మిట్ – 2017 కోసం తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. ఈ ప్రతిష్టాత్మక సదస్సు విజయవంతం కావడానికి ప్రభుత్వం సుమారు వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్టు రాష్ట్ర మంత్రి కె. తారకరామా రావు చెప్పారు.

ఇందులో ప్రపంచవ్యాప్తంగా మూడు వేల మందికి పైగా అంతర్జాతీయ స్థాయి పారిశ్రామిక ప్రతినిధులు పాల్గొంటారని ఆయన తెలిపారు. ఇది ఇలా ఉండగా ఈ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ తన ప్రతినిధి వర్గంతో వచ్చి పాల్గొంటున్నట్టు తెలిసింది. ఈ మేరకు ఆమె స్వయంగా ట్వీట్ చేశారు. భారత్ పర్యటన తనకు, తన దేశానికి గొప్ప గౌరవమని ఆమె ఆ ట్వీట్లో తెలిపారు.

కాగా, ఈ సదస్సులో తాను పాల్గొనబోతున్నట్టు ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. ఈ సదస్సుకు ఇవాంకాను కూడా ఆహ్వానించడం జరిగిందని, సదస్సులో పాల్గొనడానికి ఆమె అంగీకరించారని తెలిసిందని మోడీ తన ట్వీట్లో తెలిపారు. మోడీ ట్వీట్ కి జవాబుగానే ఇవాంకా ట్వీట్ చేశారు. నీతి ఆయోగ్, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఈ సదస్సు జరుగుతుంది. ఈ సదస్సుకు తన కుమార్తె వస్తున్న విషయాన్ని ఒక ప్రకటనలో డోనాల్డ్ ట్రంప్ కూడా ధృవీకరించారు.

Send a Comment

Your email address will not be published.