హై టెక్ స్మశానాలు

జంట నగరాలలోని హిందూ స్మశానాలను పూర్తిగా ఆధునిక హంగులతో అభివృద్ధి చేయాలని తెలంగాణా ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని దహన వాటికల్లోనూ ఆధునిక హంగులు కల్పించాలని, మౌలిక సదుపాయాలను పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది.
వీటి మీద వెయ్యి కోట్ల రూపాయల వరకూ ఖర్చు చేయడానికి సంకల్పించింది.

అంతేకాక, ప్రతి దహన వాటికలోనూ ఒకటైనా విద్యుత్ దహన వాటిక ఉండేటట్లు పథకాలు చేపడుతోంది. దహన వాటికలలో తప్పనిసరిగా ఒక ఆలయం, పార్కు, ఆధ్యాత్మిక గ్రంథాలయం, సంగీత వ్యవస్థ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం, మహా నగర పాలక సంస్థ అధికారులు సంకల్పించారు. అవసరమైతే స్మశానాల నిర్వహణ బాధ్యతను ప్రైవేట్ వ్యక్తులు లేదా సంస్థలకు అప్పగించే అవకాశం కూడా ఉంది. మొదట పెద్ద స్మశానాలను ఆధునీకరించి, ఆ తర్వాత చిన్న స్మశానాల అభివృద్ధిని చేపట్టడం జరుగుతుంది. దీనివల్ల నగరంలో అంత్యక్రియల ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్పారు.

Send a Comment

Your email address will not be published.