హ్యాపీ బర్త్ డే టూ అక్కినేని

 

నటనకే ఓనమాలు నేర్పిన మహా నటుడు నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వర రావు. నేడు తన 90వ జన్మ దినోత్సవం సందర్భం గా ఆ మహా నటుడుకి తెలుగు మల్లి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలుపుతోంది. ఆయన మరిన్ని జన్మ దినాలు జరుపు కోవాలని కోరుకుంటుంది. ఈ సందర్భం గా ఒక్కసారి అక్కినేని గురించి అవలోకనం చేసుకుందాం.

కృష్ణ జిల్లా లోని రామాపురం అనే గ్రామం లో వెంకట రత్నం, పున్నమ్మ అనే దంపతులకు 1924, September 20వ తేదీన ఐదో సంతానం గా జన్మించారు. వీరిది నిరుపేద వ్యవసాయ కుటుంబం. దాంతో ప్రాధమిక పాటశాల తోనే అక్కినేని చదువుకి ఫుల్ స్టాప్ పడింది. ఊర్లో వేసే నాటకాల్లో ఆడ పాత్రలు వేయడం మొదలు పెట్టారు.

అప్పట్లో ఆడవారు స్టేజీ పైన ఎక్కి నాటకాలు వేసే వారు కాదు. అక్కినేని సన్నగా , అందం గా ఉండడం తో అందరూ ఆడ వేషం కట్టించేవారు. ఒకసారి విజయవాడ రైల్వే స్టేషన్ లో ప్రముఖ నిర్మాత ఘంటసాల బలరామయ్య కనపడి సినిమాలో అవకాశం ఇస్తాను మద్రాస్ రమ్మని చెప్పారు. దాంతో ఎప్పుడూ ఊరు వదలి వెళ్ళని నాగేశ్వరరావు ఇప్పటి చెన్నైకి బయలు దేరి వెళ్ళారు. అక్కడ ఆయన ధర్మపత్ని అనే సినిమా లో అవకాశం ఇచ్చారు. అప్పుడు ప్రారంభమైన ఆయన నటనా జీవితం నేటి శ్రీరామదాసు వరకూ కొనసాగుతూనే ఉంది.

సినిమాలు
సీతా రామ జననం లో శ్రీ రాముడి గా అక్కినేని మొదటి సారి వెండి తెరపై హీరోగా కనిపించారు. అప్పటి నుంచి ఇప్పటి వరుకూ సుమారు 255 సినిమాలకు పైగా సినిమాల్లో అక్కినేని హీరో గా తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో నటించారు.

దేవదాసు
అక్కినేని అంటే దేవదాసు, దేవదాస్ అంటే అక్కినేని అంటారు ప్రేక్షకులు. ప్రేమలో విఫలమైన భగ్నప్రేమికుడిగా అక్కేనేని నటన ఎన్ని తరాలు మారినా జనం నీరాజనాలు పడుతున్నారు. సావిత్రి, నాగేశ్వర రావు ల నటనని మరువ లేక పోతున్నారు

పౌరాణికం
రాముడి గా, విష్ణువు గా పలు పౌరాణిక సినిమాల్లో భక్తులకు కనువిందు చేసారు.భూ కైలాస్ వంటి సినిమాలో నారదుడి గా వేసి ప్రశంసలు అందుకున్నారు. ఇంకా శ్రీ కృష్ణార్జున విజయం లో అర్జునుడి గా విశేష ఆదరణ పొందారు

భక్తుడిగా
భక్త తుకారం, పాండురంగమహత్యం వంటి సినిమాలతో భక్తుడిగా తెలుగు ప్రేక్షకులని అలరించారు. స్టెప్పులు వేసిన బుల్లోడు తెలుగు సినిమాల్లో మొదట స్టెప్పులు వేసిన ఘనత అక్కినేనిదే. చెంగావి రంగు చీర అంటూ పాట
పాడినా అక్కినేనికే చెల్లింది. నటుడుగా, నిర్మాత గా అన్నపూర్ణ సంస్థ అధినేతగాఎన్నో విజయాలు సొంతం చేసుకున్నఅక్కినేనిని పద్మభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే వంటి పలు అవార్డులువరించాయి

Send a Comment

Your email address will not be published.