10 లక్షల మందికి నిరుద్యోగ భృతి

unemploymentఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులందరికీ భృతి చెల్లించాలని చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది.

ఈ నిరుద్యోగ భృతి వల్ల రాష్ట్రంలో కనీసం పది లక్షలమంది లబ్ది పొందుతారని ప్రభుత్వం అంచనా వేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరుగురు మంత్రులు, ఆయా శాఖల అధికార్లతో దీనిపై కూలంకషంగా చర్చించి నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. విద్యావంతులకు నిరుద్యోగ భృతి చెల్లించడానికి ఏటా ప్రభుత్వానికి ఎంత లేదన్నా వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చవుతాయని ముఖ్యమంత్రికి ఆర్ధిక శాఖ తెలియజేసింది. కనీసం మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతిగా చెల్లించడంతో పాటు, వయసు, విద్యార్హతలు, నైపుణ్యాలు, స్వయం ఉపాధిపై ఆసక్తి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని, తగిన శిక్షణ కూడా ఇప్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. పదిహేను రోజుల్లో నిరుద్యోగుల సంఖ్యను అధికారులు లెక్క గట్టి తనకు నివేదికలు ఇవ్వాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఆ తరువాత ఆయన నిరుద్యోగ భృతి విషయంలో ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది.

Send a Comment

Your email address will not be published.