20 మంది చిన్నారుల దుర్మరణం

కాపలా లేని లెవెల్ క్రాసింగ్ మరోసారి ప్రాణాలు బలిగొంది. రైలు బండి పసిపిల్లల పాలిత మృత్యు శకటంగా మారింది. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద గురువారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. ముద్దులొలికె చిన్నారులు, చిట్టి పొట్టి పాపలతో వెడుతున్న స్కూల్ బస్సును రైలు డీకొంది. ఈ దుర్ఘటనలో 14 మంది పిల్లలు, బస్ డ్రైవర్, క్లీనర్, మొత్తం 16 మంది దుర్మరణం పాలయ్యారు. ఇందులో కొందరు ఒకే తల్లి పిల్లలు కూడా ఉన్నారు.

కాకతీయ స్కూల్ లో చదువుతున్న ఈ పిల్లలను స్కూల్ బస్ తీసుకువెడుతుండగా ఈ ప్రమాదం జరిగింది. కాపలా లేని లెవెల్ క్రాసింగ్ దగ్గర రైలు వస్తున్న సంగతి గమనించకుండా బస్ డ్రైవర్ బస్సును ముందుకు పోనివ్వడం, రైలు దాన్ని డీ కొనడం నిమిషాల్లో జరిగిపోయింది. బస్సును రైలు కిలోమీటర్ దూరం లాక్కుపోయింది. ఈ దుర్ఘటనలో 16 మంది పిల్లలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఒక తండ్రి, ఒక తల్లి ఈ విషాదం చూసి గుండె పగిలి చనిపోయారు.

తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు అయిదు  లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించింది.

Send a Comment

Your email address will not be published.