24 జిల్లాలు ఖాయం

తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 24 జిల్లాలు ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం మండలాల వారీగా మొత్తం వివరాలను ప్రకటించింది. ఇందులో భాగంగా హైద్రాబాద్, సికింద్రాబాద్ లను రెండు జిల్లాలుగా విభజించింది. ఇందులో అతి పెద్ద జిల్లాగా హైద్రాబాద్ అవతరించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పార్టీ సమావేశంలో మాట్లాడుతూ, ఇదివరకు ఉన్న 10 జిల్లాల పేర్లు యథాతథంగా కొనసాగుతాయని, వాటినే పునర్విభజించి కొత్తగా 14 జిల్లాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. వచ్ఛే దసరా నాటికి ఈ జిల్లాల ఏర్పాటు పూర్తవుతుందని కూడా ఆయన తెలిపారు.

Send a Comment

Your email address will not be published.